పెళ్లిలో పాట పాడిన ప్రియా వారియర్‌

4 May, 2018 10:09 IST|Sakshi

ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే సోషల్‌ మీడియా సన్సేషన్‌గా మారారు మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. మలయాళ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’ టీజర్‌లో సందడి చేసిన ప్రియా, ఆ సినిమా విడుదలకు ముందే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.  ప్రియాకు వచ్చిన ఆదరణ చూసిన చిత్ర యూనిట్‌ ఆ తర్వాత సినిమాలో ఆమె పాత్ర నిడివిని పెంచేలా రీ షూట్‌ చేశారు. ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌కు ఏ మ్రాతం తీసిపోని ఆదరణ ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్తోంది.. ఏం చేస్తుందో తెలుసుకోవడానికి అభిమానులు సోషల్‌ మీడియాలో వెతుకుతూనే ఉన్నారు.

తాజాగా ఆమె ఓ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. ఒరు అదార్‌ లవ్‌లో నటించిన తన సహ నటుడు అరుణ్‌ మ్యారేజ్‌కు హాజరయ్యారు. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొంతమంది మాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్న ఈ వివాహ వేడకలో ప్రియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పింక్‌ రంగు చీరలో పెళ్లికి హాజరైన ప్రియా మరోసారి అందరిని మాయ చేశారు. అంతే కాకుండా తన స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు. సంజయ్‌ దత్‌ ఫేమస్‌ సాంగ్‌ ‘హవా హవా’ పాటను పాడుతూ.. చిన్నగా డాన్స్‌ కూడా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు