నేనేనా? ఇది నిజమేనా?

2 Mar, 2018 00:41 IST|Sakshi
ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

కన్ను కొట్టి, కవ్వించిన పిల్ల రివ్వున ఎగి రింది. మబ్బులను దగ్గరగా చూసి సంబరపడిపోయింది. ‘మనం ఏంటి? ఎగరడం ఏంటి? ఇది కలా? నిజమా?’ అని ఒక్కసారి గిల్లి చూసుకుంది. ‘మనమే.. ఎగురుతున్నది మనమే’ అని ఆనందపడింది. మరి.. ఫస్ట్‌ టైమ్‌ విమానం ఎక్కితే ఎవరైనా ఇలానే ఆనందపడతారు కదా. జస్ట్‌ చిరునవ్వు నవ్వి, కన్ను కొట్టినందుకు బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది. కొచ్చి టు తిరువనంతపురం ట్రావెల్‌ చేసిందీ బ్యూటీ.

తొలి విమాన ప్రయాణం టికెట్‌ను దాచుకుందట. ‘లైఫ్‌లో తొలిసారి ఫ్లైట్‌ ఎక్కాను’ అని పేర్కొంది. ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈలోపు టీజర్‌ ద్వారా అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు అందరూ ఆమె నటిస్తున్న తొలి చిత్రం ‘ఒరు అడార్‌ లవ్‌’ రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఒమర్‌ లులు దర్శకత్వంలో మలయాళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌లో విడుదల చేస్తారు.

మరిన్ని వార్తలు