కామెడీ మిఠాయి

10 Feb, 2019 02:02 IST|Sakshi

‘మిఠాయి’ తియ్యగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ మా ‘మిఠాయి’ తినేది కాదు చూసేది’’ అంటున్నారు నిర్మాత డా. ప్రభాత్‌కుమార్‌. రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్‌ కామరాజ్, శ్వేతావర్మ, ఆర్ష ముఖ్య తారలుగా ప్రశాంత్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ‘‘చిత్రరంగంలో విశేష అనుభవం సంపాదించుకున్న నిర్మాత మామిడాల శ్రీనివాస్‌ ఫ్యాన్సీ ధరకు ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు’’ అని నిర్మాత తెలిపారు. రాజేశ్వరి ఫిలింస్, మూవీ మ్యాక్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ నెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాయి.

మామిడాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ డార్క్‌ కామెడీతో విభిన్నమైన పాత్రల మధ్య సాగే చిత్రమిది. రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి పాత్రలు పోటీపడి హాస్యాన్ని పంచుతాయి. అలాగే చిత్రంలో నవరసాలను దర్శకుడు ప్రశాంత్‌ చక్కగా తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లే బాగా కుదిరింది. సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్‌ మంచి బాణీలను అందించారు. సంగీతంతో పాటు కెమెరా, కామెడీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి పాటలు: కిట్టు విస్సాప్రగడ, మాటలు: బి.నరేశ్‌ రెడ్డి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు