హ్యాపీ బర్త్‌డే ‘కామ్రేడ్‌ భారతక్క’

4 Jun, 2020 09:28 IST|Sakshi

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ఓ విలక్షణ కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నటి ప్రియమణి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. గురువారం ప్రియమణి బర్త్‌ డే సందర్భంగా ‘విరాటపర్వం’లోని ఆమె ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

ఈ చిత్రంలో ‘కామ్రేడ్‌ భారతక్క’గా కనిపించనున్న ప్రియమణి.. పాత్రకు తగ్గ దుస్తులు, భుజాన తుపాకీతో పోస్టర్‌లో కనిపిస్తున్నారు. అదేవిధంగా ఏదో సాధించిన విజయం ముఖంపై చిరునవ్వు రూపంలో ప్రతిబింబిస్తోంది.  ఇప్పటివరకు ప్రియమణిని ఎప్పుడూ చూడని విధంగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్నారు. దీంతో ఈ పోస్టర్‌ క్షణాల్లోనే నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ‘మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం’ అంటూ చిత్ర బృందం తెలిపింది. 

ఇక పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి, ప్రియమణిలతో పాటు నందితా దాస్‌, నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయి చంద్‌ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో వారం రోజుల షూటింగ్ పూర్తిచేయాల్సి ఉండగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా