సరికొత్త సిరివెన్నెల 

22 Feb, 2019 02:03 IST|Sakshi

‘పెళ్లైన కొత్తలో, యమదొంగ, శంభో శివ శంభో’ వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు ప్రియమణి. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరమైన ఆమె ప్రస్తుతం ‘సిరివెన్నెల’ అనే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్‌ పులిజాల దర్శకత్వంలో ఏఎన్‌బి కో ఆర్డినేటర్స్‌ బ్యానర్‌పై ఏఎన్‌ బాషా, రామసీత నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ని బుధవారం ప్రియమణి ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ పులిజాల మాట్లాడుతూ–‘‘కె.విశ్వనాథ్‌గారు ‘సిరివెన్నెల’ అనే గొప్ప సినిమా తీశారు. అయితే మా సినిమా థ్రిల్లర్, హారర్‌ జోనర్‌ అయినప్పటికీ కథకు సరిగ్గా సరిపోతుంది కాబట్టి ‘సిరివెన్నెల’ అని టైటిల్‌ పెట్టాం. టాకీపార్ట్‌ పూర్తయ్యింది.

రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. ప్రియమణిగారు కొత్త లుక్‌లో కనిపిస్తారు’’ అన్నారు. ప్రియమణి మాట్లాడుతూ– ‘‘చాలారోజుల తర్వాత తెలుగుసినిమా చేస్తున్నాను. నాకోసం ముంబై వచ్చి ‘సిరివెన్నెల’ కథ చెప్పారు. థ్రిల్లర్‌ జోనర్‌ అయినప్పటికీ అన్ని ఎలిమెంట్స్‌ ఉన్నాయి. కథలో అతీంద్రియ శక్తులకి సంబంధించిన విషయాలు నేర్చుకునే ప్రాసెస్‌లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని డైరెక్టర్‌ థ్రిల్లింగ్‌గా చెప్పారు’’ అన్నారు. ‘‘కీరవాణిగారి దగ్గర నేను ‘బాహుబలి 2’ సినిమా వరకు మేనేజర్‌గా పని చేసాను. మా నిర్మాత కమల్‌గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్‌ లేదు. ఇది మా తొలి సినిమా అయినా చాలా బాగా వచ్చింది’’ అని నిర్మాతల్లో ఒకరైన బాషా అన్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోదీకి శుభాకాంక్షలు తెలపలేదు..!

నేనూ  అదే కోరుకుంటున్నా!

పాయల్‌ బోల్డ్‌ కబుర్లు

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!

మెంటల్‌ రైడ్‌

బుద్ధిమంతుడు

అమెరికాలో సైలెంట్‌గా...

ఆ సినిమా తీయకుండానే మంచి పేరు వచ్చింది

రణచదరంగం

స్వేచ్ఛ కోసం...

నా జీవితంలో నువ్వో మ్యాజిక్‌

మధ్య తరగతి అమ్మాయి కథ

‘వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాను’

ఇట్లు... ఓ రైతు

అయోగ్య వస్తున్నాడు

పోరాటం మొదలైంది

‘రణరంగం’.. సిద్ధం!

‘నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు’

‘టెంపర్‌’ రీమేక్‌.. తెలుగు డబ్బింగ్

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఆఫీస్‌ బాయ్‌ పెళ్లికి అల్లు అర్జున్‌

చిన్నా, పెద్ద చూడను!

శింబుదేవన్‌ దర్శకత్వంలో అందాల భామలు

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మోదీకి శుభాకాంక్షలు తెలపలేదు..!

నేనూ  అదే కోరుకుంటున్నా!

ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!