ఏడడుగులేస్తారా?

13 Jun, 2018 00:44 IST|Sakshi

ప్లేట్‌లో ఉన్న చాక్లెట్‌ పుడ్డింగ్‌ మరో సందర్భంలో అయితే టేస్టీ టేస్టీగా ఉంటుందేమో. ఎదుట ఉన్నది లవర్‌ అయితే చాక్లెట్‌ పుడ్డింగ్‌ కన్నా తన నోటి నుంచి వచ్చే మాటలే తియ్యగా ఉంటాయి. బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా, హాలీవుడ్‌ యాక్టర్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌కీ వారి మాటలే తియ్య తియ్యగా అనిపించాయట. ఈ ఇద్దరూ లవ్‌లో పడ్డారని అటు హాలీవుడ్‌ ఇటు బాలీవుడ్‌ కోడై కూస్తున్నాయి. ఇటీవల ఓ రెస్టారెంట్‌ కార్నర్‌ టేబుల్‌ దగ్గర సెటిలైన ఈ జంట బ్రెడ్‌ పుడ్డింగ్, కుక్కీస్‌ ఆర్డర్‌ చేసుకుని, మాటల మధ్యలో అవి తింటూ కాలక్షేపం చేశారట. రెస్టారెంట్‌కి వెళ్లి ఏమీ తినకపోతే బాగుండదు కాబట్టి, ఫుడ్‌ ఆర్డర్‌ చేశారు కానీ, అసలు దాని మీద ధ్యాసే లేనట్లుగా కనిపించారని హాలీవుడ్‌ మీడియా కథనం.

ఆ సంగతలా ఉంచితే.. నిక్‌ కజిన్‌ పెళ్లికి ఈ ఇద్దరూ జాయింట్‌గా వెళ్లడం చర్చనీయాంశమైంది. పెళ్లికి వెళితే తప్పా అనుకుంటున్నారేమో? ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని మరీ పెళ్లికి హాజరయ్యారు. న్యూ జెర్సీలోని అట్లాంటిక్‌ సిటీలో జరిగిన ఈ పెళ్లిలో ఎంటైర్‌ జోనస్‌ ఫ్యామిలీ ప్రియాంకకు పరిచయమైందట. ఆ పరిచయాలు ఏర్పడడానికే ప్రియాంకను తమ ఇంటి పెళ్లికి నిక్‌ తీసుకెళ్లారని టాక్‌. అన్నట్లు.. ఈ పెళ్లికి చేతిలో చెయ్యేసుకుని ‘కపుల్‌’ అటెండ్‌ అయినట్లు అవ్వడం ద్వారా తమ మధ్య సమ్‌థింగ్‌ ఉందన్న విషయాన్ని ఈ ఇద్దరూ చెప్పదలిచారా? అనే ఊహాగానాలు లేకపోలేవు. మరి.. ప్రియాంక, నిక్‌  ఏడడుగులేస్తారా? ఈ ఇద్దరి కహానీ ఎందాకా వెళుతుందో చూద్దాం. 

మరిన్ని వార్తలు