నువ్వెక్కడుంటే నేనక్కడుంటా

10 Jun, 2018 01:57 IST|Sakshi
ప్రియాంకా చోప్రా,నికీ జోనాస్‌

నిన్న మొన్నటి వరకు ప్రియాంకా చోప్రా రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ ఏంటీ? అంటే.. సింగిల్‌ అని టక్కున చెప్పేవారు ఆమె అభిమానులు. కానీ ఇప్పుడు మాత్రం డౌట్‌ పడుతున్నారు. అందుకు కారణం హాలీవుడ్‌ నటుడు నికీ జోనాస్‌. ఎందుకంటే... నువ్వెక్కడుంటే నేనక్కడుంటా టైప్‌లో ప్రియాంకా చుట్టూ తిరుగుతున్నారీ హాలీవుడ్‌ నటుడు.

రీసెంట్‌గా కాఫీ షాప్‌లో కలిసిన ఈ ఇద్దరూ తాజాగా యూకే ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. నికీ, ప్రియాంకాలది కొందరు ఫ్రెండ్‌షిప్‌ అంటున్నారు. మరికొందరు లవ్‌ అంటున్నారు. వాళ్లు మాత్రం గమ్మునుంటున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. ప్రియాంకా చోప్రా కంటే నికీ 11ఏళ్లు చిన్నవాడు. అయినా ప్రేమకు వయసు అడ్డుకాదని కొత్తగా చెప్పేది ఏమీ లేదు. పైగా హాలీవుడ్‌లో ఇలా పెద్ద వయసున్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కామన్‌.
 

మరిన్ని వార్తలు