రివెరా రొమాన్స్‌

20 May, 2019 00:21 IST|Sakshi

కాన్స్‌లో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌ జంట. మూడో రోజు ఇలా జంటగా పలు గెటప్స్‌తో ప్రేమ వొలకబోశారు. ‘రివెరా రొమాన్స్‌’ అని ఈ సిరీస్‌ ఆఫ్‌ ఫోటోలకు క్యాప్షన్‌ చేశారు ప్రియాంక.

తెలంగాణ చలన చిత్రపరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తూ ఫ్రాన్స్‌లో జరుగుతున్న కాన్స్‌ చిత్రోత్సవాల్లో తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పుస్కూరు రామ్మోహనరావు పాల్గొన్నారు. తెలంగాణ చిత్రపరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అత్యున్నత సాంకేతికను, పెట్టుబడులు ఆకర్షించడానికి, స్టూడియోలు నిర్మించడానికి, యానిమేషన్, వీడియో గేమింగ్‌ విభాగాలను విస్తరించడానికి వివిధ దేశాల ప్రతినిధులతో మాట్లాడారాయన. ఇందులో భాగంగా హిందూజా గ్రూప్‌ బ్రదర్స్‌ను తెలంగాణలో ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో స్టూడియోల నిర్మాణానికి ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. డిజిక్విస్ట్‌ చైర్మన్‌ బసిరెడ్డి, ఐటిపీవో ప్రెసిడెంట్‌ అసిఫ్‌ ఇక్భాల్‌ కాన్స్‌ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు