లాస్‌ఏంజెల్స్ టు మియామీ!

2 Mar, 2016 02:03 IST|Sakshi
లాస్‌ఏంజెల్స్ టు మియామీ!

 ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో  ప్రెజెంటర్‌గా లాస్ ఏంజెల్స్‌లో తెల్లటి గౌనులో సందడి చేసి, అదరగొట్టిన భారతీయ నటి ప్రియాంకా చోప్రా తన లొకేషన్ ను మియామీకి షిఫ్ట్ చేసేసి, ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా బిజీ అయిపోయారు. ‘క్వాంటికో’ టీవీ సిరీస్ తర్వాత ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన హాలీవుడ్ చిత్రం - ‘బే వాచ్’.
 
  చాన్నాళ్ల కిత్రం వచ్చిన ‘బే వాచ్’ అనే టీవీ సిరీస్‌కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ప్రియాంక ‘బే వాచ్ గుడీస్’ అంటూ ఆ పాత్ర కోసం వాడుతున్న వస్తువుల్ని చూపెట్టారు. చెప్పులు, టవల్ - ఇలా ఇతర వస్తువులతో ఉన్న బకెట్ ఫొటోను ట్వీట్ చేశారు. ‘‘అందరం బీచ్‌లో ఉన్నాం. షూటింగ్ మొదటిరోజు ఇది. యూనిట్ అంతా చాలా ఉత్సాహంగా ఉంది’’ అని ఆమె పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి