నంబర్‌ వన్‌

7 Dec, 2019 05:26 IST|Sakshi

ఇండియన్‌ సినిమా అండ్‌ టెలివిజన్‌ సిరీస్‌కు సంబంధించి ఇంటర్‌నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) వెబ్‌సైట్‌ ఈ ఏడాదికి సంబంధించిన ఇండియన్‌ సెలబ్రిటీస్‌ జాబితాను విడుదల చేసింది. ఇందులో తొలి స్థానంలో నిలిచారు హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా. రెండో స్థానంలో దిశా పటానీ, మూడో స్థానాన్ని హృతిక్‌ రోషన్‌ కైవసం చేసుకున్నారు. కియారా అద్వానీ, అక్షయ్‌ కుమార్, సల్మాన్‌ఖాన్, ఆలియా భట్, కత్రినా కైఫ్, రకుల్‌ప్రీత్‌ సింగ్, కత్రినా కైఫ్‌ వరుస క్రమంలో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. దక్షిణాది నుంచి కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఒక్కరే ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. ఐఎమ్‌డీబీ ప్రోస్టార్‌ మీటర్‌ ర్యాంకింగ్స్, ఐఎమ్‌డీబీ పేజ్‌ వ్యూయర్స్‌ వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ జాబితాను విడుదల చేయడం జరిగిందని ఐఎమ్‌డీబీ ప్రతినిధి పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు