పాక్‌ మహిళ నోరుమూయించిన ప్రియాంక

11 Aug, 2019 13:50 IST|Sakshi

తన పట్ల దురుసుగా ప్రవర్తించిన పాకిస్తాన్‌ మహిళకు ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఘాటు సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ఆమె నోరు కూడా మూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. శనివారం లాస్‌ ఎంజిల్స్‌లో బ్యూటికాన్‌ పేరిట జరిగిన కార్యక్రమానికి ప్రియాంక హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ప్రియాంక సమాధానాలు చెప్పడం ప్రారంభించారు. అప్పుడే ఓ పాకిస్తాన్‌ మహిళ ప్రియాంక ప్రసంగానికి అడ్డుతగిలారు. గతంలో భారత బలగాలు ఉగ్రస్థావరాలపై దాడులు జరిపినప్పుడు ప్రియాంక చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.

‘పాకిస్తాన్‌పై భారత బలగాలు వైమానిక దాడులు జరిపినప్పుడు మీరు జైహింద్‌ అంటూ ట్వీట్‌ చేశారు. యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉంటూ పాక్‌పై న్యూ క్లియర్‌ యుద్దం జరగాలని అనుకుంటున్నారు. మీరు ఆ పదవిలో ఉండేందుకు అనర్హులు. నాలాగే చాలా మంది పాకిస్తాన్‌ ప్రజలు మిమ్మల్ని ఇష్టపడతారు. కానీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారా?’ అంటూ పాక్‌ మహిళ గట్టి గట్టిగా అరిచారు. అయితే ఆమె మాట్లాడినంత సేపు మౌనంగా ఉన్న ప్రియాంక..  ఆ తర్వాత చాలా ఓపికగా సమాధానమిచ్చారు.

‘నేను మీ మాటలు వినాను. నాకు పాక్‌లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. నేను భారతీయురాలిని. నా దేశం అంటే నాకు గౌరవం. యుద్దం దేనికి పరిష్కారం కాదు. నేను ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ నన్ను ఇష్టపడేవారి సెంటిమెంట్స్‌ దెబ్బతింటే సారీ. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తున్నావో, నేను కూడా అంతే. కానీ నువ్వు అడిగిన విధానం బాగాలేదు. ఇలాంటి ప్రశ్నలు అడగాడినికి ఇది వేదిక కాదు. అనవసరంగా అరచి మీ విలువను తగ్గించుకోవద్ద’ని సూచించారు. ప్రపంచంలో సగం సంఖ్యలో ఉన్న మహిళలు.. ప్రతి రంగంలో ముందువరుసలో నిలువాలని ప్రియాంక అన్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ  మందుకు సాగాలని ఆకాక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌

ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్

శర్వానంద్‌లో నచ్చేది అదే : రామ్‌చరణ్‌

స్టార్‌ హీరోను ఆ ప్రశ్న అడిగిన అభిమాని..!

బిగ్‌బాస్‌.. తమన్నా అవుట్‌!

కె.విశ్వనాథ్‌ ఆరోగ్యంగా ఉన్నారు!

‘ఛలో సినిమా పుణ్యమా అని తెలుగు తెలిసింది’

రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌పై మంచు విష్ణు ట్వీట్‌

ట్విటర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్‌ డైరెక్టర్‌

నాని విలన్‌ లుక్‌!

భావోద్వేగానికి గురయ్యాను: సింగర్‌ సునీత

‘విక్కీ డోనర్‌’ రీమేక్‌లో తాన్యా!

సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌?

ఆ ముగ్గురిలో నేనున్నా!

మహేష్‌ని ఆడేసుకుంటున్నారు!

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

పెళ్లైన వ్యక్తితో ఎఫైర్‌.. అందుకే డిప్రెషన్‌: నటి

‘‘సాహో’ రికార్డులు సృష్టించాలి’

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

బాలీవుడ్‌పై బాంబ్‌ పేల్చిన హీరో!

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం

గతంలో ఎన్నడు చూడని మోదీని చూస్తారు!

ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది

సాయిపల్లవి ‘అనుకోని అతిథి’

‘డియర్‌ కామ్రేడ్‌’కి నో చెప్పిన బాలీవుడ్ హీరో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌

ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్

కె.విశ్వనాథ్‌ ఆరోగ్యంగా ఉన్నారు!

శర్వానంద్‌లో నచ్చేది అదే : రామ్‌చరణ్‌

స్టార్‌ హీరోను ఆ ప్రశ్న అడిగిన అభిమాని..!

బిగ్‌బాస్‌.. తమన్నా అవుట్‌!