‘ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావనుకుంటున్నా’

15 Jun, 2020 20:33 IST|Sakshi

ముంబై: ‘సుశాంత్ సింగ్‌ రాజ్‌ఫుత్‌‌ మరణం ఆయన కుటుంబానికి, బాలీవుడ్‌కు తీరని లోటు. దీని నుంచి త్వరలోనే అందరూ కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చొప్రా సోషల్‌ మీడియాలో భావోద్యేగ పోస్టును పంచుకున్నారు. సుశాంత్‌ ముంబైలోని తన నివాసంలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణానికి ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో సంతాపం తెలిపారు. సుశాంత్‌ను‌ బ్రిలియంట్‌ స్టూడెంట్‌ అంటూ ప్రశంసిస్తూ ఆస్ట్రోఫిజిక్స్ గురించి అతడు‌ వివరించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

‘‘నీ మరణ వార్త విని షాకయ్యాను. నువ్వు ఇంతలా మానసిక ఒత్తిడికి గురవయ్యావంటే నమ్మలేకపోతున్న. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావని నమ్ముతున్నా మై ఫ్రెండ్‌. సూర్యోదయంలో ఆస్ట్రోఫిజిక్స్‌ గురించి నువ్వు వివరించిన సందర్భాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు ఎంతో తెలివైన వ్యక్తివి. నీ ఆత్మ ఎక్కడున్న ప్రశాంతంగా ఉండాలి సుశాంత్‌’’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. లాక్‌డౌన్‌లో‌ ఒంటరిగా తన నివాసంలో ఉంటున్న సుశాంత్‌ తీవ్ర మానసిక వేదనతో బాధపడుతూ‌ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ​కాగా ఇవాళ(సోమవారం) సాయంత్రం ముంబైలోని విలే పార్లే వద్ద పవన్ హన్స్ శ్మశానవాటికలో సుశాంత్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. (సుశాంత్‌ సింగ్‌ విశేషాలెన్నో!)

I’m stunned. You must have been in so much pain. I hope you are at peace wherever you are my friend. Gone too soon. I’ll never forget our conversations about astrophysics at sunrise..Words cease to make sense. RIP Sushant. My condolences to the family and everyone grieving this huge loss 💔

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు