రెండు నెల‌ల త‌ర్వాత బయటకు..

13 May, 2020 09:14 IST|Sakshi

క‌రోనా వైర‌స్ కార‌ణంగా బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా, భ‌ర్త నిక్ జోన‌స్‌తో క‌లిసి అమెరికాలోని లాస్ఎంజిల్స్‌లో ఇంటికే ప‌రిమిత‌మయ్యారు. దాదాపు రెండు నెల‌ల సుధీర్ఘ విరామం అనంత‌రం ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చారు. అమెరికాలో ప‌రిస్థితి కాస్త సాధారణ స్థితికి రావ‌డంతో మాస్క్ ధ‌రించి ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.  అంత‌కుముందు సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్న ప్రియాంక‌, నిక్ దంప‌తులు క‌రోనా వల్ల ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌పై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. (టాప్‌లో ప్రియాంక... సల్మాన్‌! )

‘మ‌న చుట్టూ ఎంతో మంది ఉండేవారు. ఇప్ప‌డు ఒంట‌రిగా ఉండాల్సి వ‌స్తుంది. షూటింగ్‌ల‌ను బాగా మిస్ అవుతున్నా’ అంటూ ప్రియంక పేర్కొంది. అంతేకాకుండా ఈ విలువైన స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటుంది. హిపాప్ డ్యాన్స్ నేర్చుకుంటూనే, తాజాగా పియానో కూడా నేర్చుకుంటుంది. స్వ‌యంగా ఆమె భ‌ర్త నిక్ త‌న‌కు పియానో నేర్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. త‌న‌కెంతో ఇష్ట‌మైన పియానోను త‌న‌కిష్ట‌మైన వ్య‌క్తి నుంచి నేర్చుకుంటున్న‌ట్లు పేర్కొంది. అమెరికాలో క‌రోనా కార‌ణంగా ఇప్పటివరకు 80 వేల మందిపైగా మ‌ర‌ణించారు. 


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు