నిక్‌ జొనాస్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రియాంక

27 Nov, 2019 13:13 IST|Sakshi

ముంబై : ‘వైట్‌ టైగర్‌’ సినిమా షూటింగ్‌లో బీజీగా ఉన్నారు బాలీవుడ్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. మరికొన్ని రోజుల్లో ఈ గ్లోబల్‌ స్టార్‌ మొదటి పెళ్లి రోజును జరుపుకోబోతున్నారు.  2018 డిసెంబర్‌ 1న వీరి వివాహం అయిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు కొన్ని రోజులు విరామం ఇచ్చిన ప్రియాంక అమెరికాకు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌ వెళ్లిన ప్రియాంక భర్త హలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. జెర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన ఓ కుక్కపిల్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి ‘గినో’ గా అప్పుడే పేరు కూడా పెట్టేశారు. ఇందుకు నిక్‌ నిద్రలేవక ముందే కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చి ప్రియాంక సర్‌ప్రైజ్‌ చేశారు. ఇదంతా వీడియో తీసిన ప్రియాంక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.  దీనికి ‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరూ క్యూట్‌గా ఉన్నారు. హ్యపీ యానివర్సరీ బేబీ’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. 

ఇ​క దీనిపై స్పందించిన నిక్‌...‘ఉదయాన్నే నాకు మంచి బహుమతి అందింది. మా గిల్‌కు హాయ్‌ చెప్పండి.  నిద్ర లేచినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాను. థాంక్యూ ప్రియాంక’ అంటూ తెలిపారు. కాగా ఇప్పటికే ప్రియాంక చోప్రా ఇంటిలో డయానా అనే కుక్క ఉంది. దీనిని 2016 నవంబర్‌లో తీసుకొచ్చారు. దీని పేరు మీద ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ కూడా ఉందంటే ప్రియాంకు డయానా అంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు. తాజాగా గినోను ఇంటికి తీసుకువచ్చిన క్రమంలో డయానాను కూడా మేము ప్రేమిస్తున్నాం అని ప్రియాంక చెప్పుకొచ్చారు. ఇక మొదటి పెళ్లిరోజు దగ్గరపడుతుండటంతో ఇటీవల కొనుగోలు చేసిన ఇంటిలో ప్రియాంక, నిక్‌ కపుల్‌ ఈ వేడుకలను జరుపుకోబుతున్నారు.

so much cute in the same frame. 😂🐶❤ happy almost anniversary baby. #repost @nickjonas • Pri came home with the absolute best surprise this morning. Please meet our new pup @ginothegerman I haven’t stopped smiling since I woke up this morning and finally realized what was going on. Thank you @priyankachopra ❤️ 🐕

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు

సినిమా

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు

‘జుమాంజి’ నటికి కరోనా