అలియా నువ్వు మిస్సయిపోయావు : ప్రియాంక

29 Apr, 2019 13:17 IST|Sakshi

‘ఇంట్లో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌ వావ్‌! నీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. లవ్‌ యూ ఇషా. మీ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది! నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. గర్ల్స్‌నైట్‌లో ఈ అమ్మాయిలు. అలియా ఈ ఇంతటి ఎంజాయ్‌మెంట్‌ను నువ్వు మిస్సయిపోయాం! లవ్‌ యూ ఆల్‌ లేడీస్‌! అంటూ గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆమె అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తన బెస్టీ ఇషా అంబానీ పిరమాల్‌ ఇంట్లో కజిన్‌ పరిణీతి చోప్రా, రాధికా మర్చంట్‌ ఇతర స్నేహితులతో కలిసి దిగిన ప్రియాంక ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మీ ఫ్రెండ్‌షిప్‌ ఇలాగే కొనసాగాలి అంటూ లక్షల సంఖ్యలో లైకులు కొడుతున్నారు నెటిజన్లు.

కాగా ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ- నీతాల ఏకైక కుమార్తె ఇషా అంబానీ వివాహం పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌తో గతేడాది డిసెంబరు 12న జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా ఇషా పరిణయం నిలిచింది. వివాహానంతం ఇషా, ఆనంద్‌ 50 వేల అడుగుల విస్తీర్ణం గల ‘గులితా’ అనే భారీ బంగ్లాలో నివసిస్తున్నారు. అరేబియా సముద్రం ఒడ్డున గల విలాసవంతమైన బంగ్లాను రూ.450 కోట్లు పెట్టి పిరమాల్‌ సంస్థ 2012లో కొనుగోలు చేసింది. ఆనంద్‌కు వెడ్డింగ్‌ గిఫ్ట్‌గా అతని తల్లి దండ్రులు స్వాతి, అజయ్‌ పిరమాల్‌ ఈ ఖరీదైన భవనాన్ని బహూకరించారు. ఇక ఈ ఇంటిలోనే ఇషా తన ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చారు. ఎంతో విలాసవంతమైన ఈ బంగ్లాను చూసి ముగ్ధురాలైన ప్రియాంక.. మీ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది ఇషాకు కాంప్లిమెంట్‌ ఇచ్చింది.

Making home made ice cream! Thank you to the hostess with the mostest. @_iiishmagish love u! Your home is amazing! I wish you love and laughter always. Here’s to many more girls nights!❤️💋 @aliaabhatt u Missed the madness by minutes! Love all u ladies!

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

మరిన్ని వార్తలు