నానితో ప్రియాంక చోప్రా..?

12 Dec, 2016 15:17 IST|Sakshi
నానితో ప్రియాంక చోప్రా..?

బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటు పలు అంతర్జాతీయ టీవీ షోలతో బిజీ బిజీగా ఉన్న హాట్ బ్యూటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం నిర్మాణ రంగంలోనూ బిజీ అవుతోంది. పర్పల్ పెబల్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించిన ప్రియాంక, ఆ బ్యానర్లో ఓ మరాఠి చిత్రాన్నినిర్మించింది. తొలి ప్రయత్నం సక్సెస్ కావటంతో ఇప్పుడు మరిన్ని ప్రాంతీయ భాషల్లో చిత్రాలు నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటుంది. తన రెండో సినిమాను టాలీవుడ్లో నిర్మించేందుకు రెడీ అవుతోంది ప్రియాంక.

ప్రియాంక నిర్మించనున్న తొలి సౌత్ సినిమాలో నాని హీరోగా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే యష్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన తొలి సౌత్ సినిమా ఆహా కళ్యాణంలో హీరోగా నటించిన నాని, ఇప్పుడు ప్రియాంక సినిమాతో బాలీవుడ్ సినీ జనాలకు మరింత చేరువవుతున్నాడు. ప్రస్తుతం నేనులోకల్తో పాటు, శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న మరో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రియాంక నిర్మాణంలో నాని నటించటం కాయం అయితే ఈ రెండు సినిమాల తరువాతే ఆ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి