కాలేజీ రోజులు గుర్తుకువస్తాయి! – అనిల్‌ సుంకర

15 Mar, 2018 00:05 IST|Sakshi
శరణ్, నాగశౌర్య, నిఖిల్, కిషన్‌ రెడ్డి, సిమ్రాన్, సంయుక్త, అనిల్‌ సుంకర

నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై ఏటీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘కిరాక్‌ పార్టీ’. సిమ్రాన్, సంయుక్తా హెగ్డే కథానాయికలు. ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో థియేట్రికల్‌ ట్రైలర్‌ను తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేత జి. కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సినిమాను శుక్రవారం విడుదల చేయనున్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘నిఖిల్‌ ఎనర్జిటిక్‌ హీరో. సినిమా ఎంత కిరాక్‌గా ఉన్నా కూడా మంచి మెసేజ్‌ ఉంటుందని భావిస్తున్నా. దర్శకుడికి మంచి పేరు, నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కార్తీకేయ’ సినిమాకు శరణ్‌ నాతో వర్క్‌ చేశాడు. ఇప్పుడు తన డైరెక్షన్‌లో నేను వర్క్‌ చేశాను.

మేమిద్దరం కలిసి చేసిన చిత్రమిది’’ అన్నారు దర్శకుడు చందు మొండేటి. ‘‘ఈ సినిమా చూసిన వారందరూ... సినిమాతో ప్రేమలో పడిపోతారు. కాలేజీ రోజులు గుర్తుకు వస్తాయి. కిషోర్‌గారు ప్రొడక్షన్‌లో సహకారం అందించారు’’ అన్నారు నిర్మాత అనిల్‌ సుంకర. ‘‘హ్యాపీడేస్‌ ఎన్ని రోజులు ఆడిందో.. అంతకంటే ఎక్కువ రోజులు ‘కిరాక్‌ పార్టీ’ ఆడుతుంది’’ అన్నారు నాగశౌర్య. ‘‘మహిళలకు గౌరవం ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాం. అనిల్‌గారు, కిషోర్‌గారి వల్లే ఈ సినిమా స్టారై్టంది. సుధీర్‌వర్మ మంచి డైలాగ్స్‌ అందించారు. చందు బౌండెడ్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు. చరణ్‌ అద్భుతంగా  తీశాడు’’ అన్నారు నిఖిల్‌. ‘‘టీమ్‌ అంతా కష్టపడి చేసిన సినిమా ఇది’’ అన్నారు శరణ్‌.

మరిన్ని వార్తలు