నా జీవితమే ఓ పెద్ద సినిమా!

13 Mar, 2017 23:31 IST|Sakshi
నా జీవితమే ఓ పెద్ద సినిమా!

– బలగ ప్రకాశరావు
‘‘ఓ సినిమాలో ఎన్ని మలుపులుంటాయో, నా జీవితంలో అన్ని మలుపులున్నాయి. ప్రతి మలుపునూ ధైర్యంగా ఎదుర్కొని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశా. విజయం సాధించా! నా జీవితానికి నేనే హీరో. ఈ ప్రయాణంలో నాకెందరో స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడు నేను కొందరికి స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉంది. నేనొక్కడినే వృద్ధిలోకి వస్తే చాలనుకోవడం లేదు. నా విజయం మరికొందరికి ఉపయోగపడాలనుకుంటున్నాను. సినీ నిర్మాణంతో పాటు సేవా కార్యక్రమాలకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను’’ అన్నారు నిర్మాత బలగ ప్రకాశరావు. శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా కుమార్‌ వట్టి దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై ‘బేబీ’ సాక్షి సమర్పణలో బలగ ప్రకాశరావు నిర్మించిన ‘మా అబ్బాయి’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బలగ ప్రకాశ రావుతో జరిపిన ఇంటర్వ్యూ...

హాయ్‌ అండీ! చిన్న వయసులోనే నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. మీ నేపథ్యం ఏంటి?
మాది శ్రీకాకుళం జిల్లా, నందిగాం మండలంలోని బడగాం గ్రామం. నేను సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను. స్వశక్తితో పనిచేస్తూ, కష్టపడి ఉన్నత స్థాయికి వచ్చాను. నా కుటుంబమే నా ఆస్తి... నా ఆత్మ విశ్వాసమే నా సంపద... నా క్రమశిక్షణే నా పెట్టుబడి.

నిర్మాతగా ‘మా అబ్బాయి’ మీకు తొలి సినిమా. చిత్ర నిర్మాణం మీకు ఎలా అనిపించింది?
సినిమా రంగంతో ఇంతకు ముందు నాకసలు పరిచయమే లేదు. మా ప్రాంతంలో ‘సినిమా పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. అదొక భిన్నమైన వాతావరణం. తెరపై నటించేవారి కన్నా తెరవెనుక నటించేవారే ఎక్కువ’ అని ప్రచారంలో ఉండేది. కానీ, అదంతా నిజం కాదని ఈ సినిమా నిర్మాణంలో అర్థమవుతూ వచ్చింది. చిత్ర పరిశ్రమ ఓ ఉమ్మడి కుటుంబం వంటిది. ఇక్కడ మా పల్లెల్ని మించిన ప్రోత్సాహం, ఆదరణ, సహకారం చూసి ఎంతో ఆనందపడ్డా.

నిర్మాతగా మీకు అనుభవం లేదు కదా.. ఎవరెవరు హెల్ప్‌ చేశారు?
మొదట్లో నేను ‘ఈ ఒక్క సినిమా పూర్తి చేయగలిగితే చాలు’ అనుకున్నా. ఇప్పుడు మాత్రం నా ఆలోచన మరోలా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రోత్సాహం చూసిన తర్వాత 100 సినిమాలు చెయ్యాలనేంత ఉత్సాహం వచ్చింది. నిర్మాతగా ఈ ప్రయాణంలో కొందరు పెద్దల్ని కలసిన తర్వాత క్రమశిక్షణ గురించి తెలుసుకున్నా. నిర్ణీత సమయంలో సినిమా పూర్తి చేయాలని అర్థమైంది. మా సినిమాకి చేసిన లైట్‌ బాయ్‌ నుంచి దర్శకుడి వరకు అందరూ ప్రతిభావంతులే. వీరి సహకారం మరువలేను. ప్రత్యేకించి వారాహి చలన చిత్రం సాయి కొర్రపాటిగారు పెద్దన్నలా ఆదరించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి. సురేశ్‌బాబుగారు మార్గదర్శిగా నిలిచి, స్ఫూర్తినిచ్చారు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత మల్కాపురం శివకుమార్‌ గారు అండగా నిలిచారు. వీరందరి సహకారం నాకెంతో ఆత్మసై్థర్యాన్నిచ్చింది.

హీరో శ్రీవిష్ణుకు మంచి పేరున్నా... దర్శకుడు కుమార్‌ వట్టి, సంగీత దర్శకుడు సురేశ్‌ బొబ్బిలి, హీరోయిన్‌ చిత్ర శుక్ల... అందరూ కొత్తవారే. అంతా కొత్తవాళ్లతో సినిమా రిస్క్‌ అనిపించలేదా?
లేదండీ. కథపై నమ్మకంతో ముందుకెళ్లాం. ఇలాంటి కథను పెద్ద టీమ్‌తో చేయాలి. టాప్‌ స్టార్స్, టెక్నీషియన్స్‌ డేట్స్‌ దొరకడం, నిర్ణీత కాలంలో పూర్తి చేయడం కొంచెం రిస్క్‌. దానితో పోలిస్తే... కొత్తవాళ్లతో రిస్క్‌ అనిపించలేదు. ఈ సినిమాతో శ్రీవిష్ణుకు మరింత గుర్తింపు వస్తుంది. ఈ చిత్రానికి పనిచేసిన కొత్తవాళ్లకు ప్రేక్షకుల్లో, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వస్తుందని నా నమ్మకం. విడుదల తర్వాత టీమ్‌ అందరూ ‘మా అబ్బాయి’కి పని చేశామని గర్వంగా చెప్పుకుంటారు. ఈ సినిమా పేరు చెప్పుకుని ముందుకు వెళతారు. నాకూ పరిశ్రమలో ఈ సినిమా చిరునామా ఇస్తుందనే నమ్మకం ఉంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం వల్ల మంచి అవుట్‌పుట్‌ వచ్చింది. ఆడియో మంచి హిట్టయింది. ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అంచనాలకు తగ్గట్టుగా ‘మా అబ్బాయి’ మంచి హిట్‌ అందుకుంటాడు. అందులో ఎటువంటి అనుమానాలు లేవు.

సరిగ్గా 10వ తరగతి పరీక్షల టైమ్‌లో సినిమా విడుదల చేస్తున్నారు. అవగాహన లోపమా? వసూళ్లు తగ్గుతాయేమో కదా?
నాకు అవగాహన లేకపోతే ‘మా అబ్బాయి’ విడుదల వరకూ వచ్చేది కాదు. సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోతే... ప్రేక్షకుల్లో, ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇంత ఆసక్తి నెలకొనేది కాదు. ఎగ్జామ్స్‌ టెన్త్‌ స్టూడెంట్స్‌కి మాత్రమే కాదు, మా సినిమా యూనిట్‌ సభ్యులకు కూడా. ఈ సినిమాపైనే మా అందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. సినిమాపై మాకెంతో నమ్మకముంది. ఆలస్యంగా విడుదల చేయడం ఇష్టంలేక ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. టెన్త్‌ ఎగ్జామ్స్‌ ప్రభావం మా సినిమాపై ఉండదు. ఇంటర్, డిగ్రీ పరీక్షలు పూర్తి కావొస్తున్నాయి. మా సినిమా స్టూడెంట్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం మాకుంది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. వసూళ్లు, విజయంపై మాకెలాంటి అనుమానాలు లేవు.

అసలు సినిమా కథేంటో చెప్పలేదు..?
తన కుటుంబానికి ఎదురైన సమస్యను ఓ కుర్రాడు ఎలా పరిష్కరించాడనేది కథ. లవ్, రొమాన్స్, కామెడీ, మంచి పాటలు, ఫైట్స్‌... కమర్షియల్‌ హంగులన్నీ ఉన్నాయి. నెక్ట్స్‌ ఏంటి? అనే ట్విస్టులతో ముందుకు వెళ్తుంది. అలాగే, చిన్న సందేశం కూడా ఉంటుంది.

నిర్మాతగా మీ తదుపరి ప్రణాళిక ఏంటి?
ఓ నెల ముందు అడిగితే నా దగ్గర సమాధానం ఉండేది కాదేమో! ఇప్పుడు మాత్రం కచ్చితంగా సినీ రంగంలోనే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చాను. ప్రేక్షకుల్లో సామాజిక చైతన్యం కల్పించే మరిన్ని మంచి చిత్రాలు తీయాలనుంది. ఈ క్రమంలోనే కొన్ని కథలు అనుకుంటున్నాం. ఈ అందమైన రంగుల ప్రపంచంలో ఆనందాల హరివిల్లు విరబూయించాలనేది ప్రస్తుత ప్రణాళిక.

శ్రీకాకుళం జిల్లా మారుమూల పల్లె నుంచి వచ్చిన మీరు సినిమా నిర్మించే స్థాయికి ఎలా చేరుకున్నారు? మీకు కలిసొచ్చిన అంశాలేంటి?
ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం నన్ను ధైర్యంగా ముందుకు వెళ్లేలా చేశాయి. భగవంతుని దయ, స్నేహితుల సహకారం నన్ను విజయానికి చేరువ చేశాయి. మనిషిని మనిషే నమ్మకపోతే ఎలా? సానుకూల దృక్పథంతో ఎదుటివ్యక్తిని నమ్మడం విజయానికి మొదటి మెట్టు. ఎవరో ఒకరిద్దరు మన అంచనాలకి తగ్గట్టు లేరని, మనం ఆశించినట్టు లేరని ప్రపంచాన్ని నిందించడం సరికాదు. ప్రపంచం మనల్ని నమ్మకపోతే... మనకీ స్వేచ్ఛ ఎక్కడిది? అలాగే మనమూ ఎదుటివారిపై విశ్వాసం ఉంచాలి. విజయానికి రెండో మెట్టు.. నిర్ణయాధికారం. మనల్ని ఎవరు వ్యతిరేకించినా.. ప్రపంచం మొత్తం కాదన్నా... మనం తీసుకున్న నిర్ణయం మీద స్పష్టత ఉంటే ధైర్యంగా ముందడుగు వేయాలి. ఈ రెండిటితో పాటు నా బలం నా స్నేహితులే. నేను కష్టంలో ఉన్నానని తెలిస్తే నా చుట్టూ రక్షణగా నిలబడతారు. నేను వేసే ప్రతి అడుగునూ ప్రోత్సహిస్తారు.

మా అబ్బాయి సూపర్‌హిట్‌ కావడం గ్యారంటీ

విడుదలకు ముందు ఇంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.. దీనికి కారణం?
నేను నమ్మేది సమయాన్నే. ప్రపంచంలో దేశాలను బట్టి కరెన్సీ.. ప్రాంతాలను బట్టి భాషలు... కాలాన్ని బట్టి వాతావరణం మారుతుంటాయి. పేద–ధనిక, చిన్న–పెద్ద, ఆడ–మగ.. ఇటువంటి తేడాలు లేకుండా విశ్వమంతా సమానమైంది కాలం మాత్రమే. నేను దాన్ని నమ్ముతాను. టైమ్‌ను నమ్ముకున్నోళ్లు, సద్వినియోగం చేసుకున్నోళ్లు తప్పకుండా విజయం సాధిస్తారు. ‘మా అబ్బాయి’ సూపర్‌హిట్‌ కావడం గ్యారంటీ!

మీ జీవిత లక్ష్యం ఏంటి?
నాకంటూ కొన్ని ఆలోచనలున్నాయి. చెబితే అతిశయోక్తిగా ఉంటుందేమో! కానీ, కచ్చితంగా చేసి తీరుతాను. జీవితంలో ఎప్పుడైనా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తినిచ్చే కార్యక్రమం ఒక్కటైనా చేసుండాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పెరిగిన ఊరు, చిన్ననాటి స్నేహం, నా ప్రాంతం అంతా శెహభాష్‌ అనేలా మా ప్రాంతానికి పనికొచ్చే పని ఏదైనా చెయ్యాలి. అది కూడా అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. ఏ పనైనా ప్రారంభించడం గొప్పకాదు... మనం ఉన్నా, లేకపోయినా మనం ప్రారంభించిన కార్యక్రమం ఆగకూడదు. నా దృక్పథం అదే. నిర్దిష్టమైన ప్రణాళికతో కొంచెం టైమ్‌ తీసుకుని నేను చేయాలనుకున్న పనిని ప్రారంభిస్తా. వ్యాపారం నచ్చకపోతే ఆపేయొచ్చు.. కానీ, సహకారం అలా కాకూడదు. పలువురి జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. అందుకే, నాకు శాశ్వత సేవా కార్యక్రమం నిర్వహించే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌