సహనం కోల్పోనివ్వకండి

8 Jan, 2019 00:32 IST|Sakshi
‘బన్నీ’ వాసు

‘థియేటర్స్‌ దొరకనివ్వకుండా ఓ మాఫియా జరుగుతోంది. సినిమాను సాఫీగా రిలీజ్‌ చేసుకోలేకపోతున్నాం. థియేటర్స్‌ అన్నీ నలుగురైదుగురు చేతుల్లోనే ఉండిపోయాయి’ అంటూ ‘పేటా’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నిర్మాత ప్రసన్నకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సమాధానంగా నిర్మాత ‘బన్నీ’ వాసు, తన సోషల్‌ మీడియాలో ‘‘ప్రసన్నగారు, తమరు తెలిసీ తెలియని మిడి మిడి జ్ఞానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం హద్దుని దాటడం మాత్రమే మిగిలింది’’ అని రాసుకొచ్చారు.

మరిన్ని వార్తలు