ఇప్పుడు స్టార్ట్.. యాక్షన్... కట్...!

30 Nov, 2015 00:19 IST|Sakshi
ఇప్పుడు స్టార్ట్.. యాక్షన్... కట్...!

కథానాయికగా చిన్న వయసులోనే  ఆస్కార్ అవార్డు అందుకున్న హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ త్వరలో దర్శకురాలిగా స్టార్ట్.. యాక్షన్.. కట్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఒకవైపు కథానాయికగా నటిస్తూనే తాను తీయబోయే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారామె. ‘ప్రాజెక్ట్ డెలీరియం’ టైటిల్‌తో కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ‘‘నాకు యాక్టింగ్ ఎంత ఇష్టమో, డెరైక్షన్ కూడా అంతే ఇష్టం.
 
 నటిగా మొదటి సినిమా చేస్తున్నప్పుడే ఎప్పటికైనా డెరైక్షన్ చేయాలనే కోరిక నాలో కలిగింది. అది ఇప్పుడు తీర్చుకుంటున్నా. 60వ దశకాల్లో  మిలటరీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. డెలీరియం అనే రసాయనం మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు చోటు చేసుకున్న పరిణామాలతో సాగే కథ ఇది. చాలా ఫన్నీగా ఉంటుంది’’ అని జెన్నిఫర్ చెప్పారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి