ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి

28 Jun, 2013 18:53 IST|Sakshi

నారాయణఖేడ్, న్యూస్‌లైన్: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి చెందడం బంధువులు ఆందోళనకు దిగారు. నారాయణఖేడ్ మండలం సత్తెగామ గ్రామానికి చెందిన టి.సుభాష్.. అతడి భార్య టి.వినోదను రెండో కాన్పు కోసం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఖేడ్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆస్పత్రి సిబ్బంది పరిశీలించి ఇంజక్షన్ చేశారని, రెండు గంటల తర్వాత నొప్పులు వస్తాయని, తమకు సమాచారం ఇవ్వాలని సూచించినట్లు సుభాష్ చెప్పారు. మూడు గంటల సమయంలో నొప్పులు రావడంతో ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఉదయం 11గంటల సమయంలో ఏఎన్‌ఎం లక్ష్మి నిర్లక్ష్యంగా కాన్పు చేయడంతో శిశువు మరణించాడన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట కొద్దిసేపు బంధువులు ఆందోళన చేశారు. ఈ విషయమై ఆస్పత్రి వైద్యులు నర్సింగ్ చౌహాన్ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ  ఉదయమే వేరే ఆస్పత్రికి తీసుకెళ్ళాలని సూచిం చామని, శిశువు ఉమ్మనీరు తాగిందని చెప్పారు.  
 

>