స్క్రీన్‌ టెస్ట్‌

21 Nov, 2017 00:05 IST|Sakshi

► ఈ పంజాబి భామ అసలు పేరు ‘సుర్దీప్‌ కౌర్‌’, ఆమె స్క్రీన్‌ పేరేంటి?
ఎ) రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బి) తాప్సీ సి) కాజల్‌ అగర్వాల్‌ డి) చార్మీ

► యస్వీ రంగారావు నటుడు కాక ముందు గవర్నమెంట్‌ ఉద్యోగం చేశారు. ఏ డిపార్టుమెంట్‌లో (శాఖ) ఆయన పనిచేశారు?
ఎ) ఆర్మీ బి) తపాల సి) ఫైర్‌ డి) ఎక్సైజ్‌

► పరుచూరి బ్రదర్స్‌ రచయితగా పనిచేసిన తొలి చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? చిన్న క్లూ... ఆయన నటుడు కూడా?
ఎ) నాగభూషణం బి) దేవదాసు.కనకాల సి) కె.బి.తిలక్‌ డి) నగేశ్‌

► నటి స్నేహ నటించిన మొదటి తెలుగు సినిమా హీరో ఎవరు గుర్తు తెచ్చుకోండి?
ఎ) నాగార్జున   బి) వెంకటేశ్‌  సి) రవితేజ డి) గోపిచంద్‌

 ► ‘ప్రతిఘటన’ సినిమాకు దర్శకుడు టి.కృష్ణ మొదటగా అనుకొన్న హీరోయిన్‌ విజయశాంతి కాదు. అయితే మరి ఆ హీరోయిన్‌ ఎవరు?
ఎ) రాధిక   బి) సుహాసిని  సి) రాధ   డి) శారద

► నటుడు ఆర్‌. నారాయణమూర్తి హీరోగా చేయకముందు, క్రాంతికుమార్‌ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఓ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. ఆ సినిమా పేరేంటి?
ఎ) రుద్రవీణ బి) శివుడు శివుడు శివుడు సి) విజేత  డి) ఖైదీ

► మహేశ్‌ బాబు బాలనటుడిగా తన తండ్రి కృష్ణతో కలిసి ఎన్ని సినిమాలలో నటించాడో తెలుసా?
ఎ)  3      బి) 4 సి) 2     డి) 5

► కరుణాకరన్‌ దర్శకత్వం వహించిన ‘తొలిప్రేమ’ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరో కనుక్కోండి?
ఎ) మణిశర్మ బి) ఏ.ఆర్‌.రహమా  సి) దేవాడి) దేవి శ్రీ ప్రసాద్‌

► ఎన్టీఆర్‌ నటించిన ‘పాండవ వనవాసం’ చిత్ర దర్శకుడు ఎవరు?
ఎ) బి.యన్‌.రెడ్డి  బి) ప్రత్యగాత్మ సి) కమలాకర కామేశ్వరరావు డి) కె.వి.రెడ్డి

► ఏ పాటనైనా తీయటానికి ముందు ఆ పాటను కనీసం వందసార్లు వింటానని చెప్పే దర్శకుడెవరు?
ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్రరావు సి) కోడి రామకృష్ణ డి) బి.గోపాల్‌

► ‘శంకరాభరణం’ చిత్ర మాటల రచయిత ఎవరో తెలుసా?
ఎ) జంధ్యాల బి) సిరివెన్నెల సి) యం.వి.యస్‌. హరనా«థ రావు డి) కృష్ణశాస్త్రి

► ‘నేను పక్కా లోకల్‌ పక్కా లోకల్‌’ పాట రచయిత?
ఎ) భాస్కరభట్ల  బి) రామజోగయ్య శాస్త్రి సి) సాహితి డి) అనంత శ్రీరామ్‌

► నటి త్రిష ట్విట్టర్‌ ఐడీ ఏంటో తెలుసా?
ఎ) త్రిష బి) త్రిషట్రాషెర్స్‌ సి) మీ త్రిష డి) నేమ్‌ ఈస్‌ త్రిష

► నటుడు నాగచైతన్య నటించిన ఒక సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్‌ చిన్న పాత్రలో నటించారు. అది ఏ సినిమా కోసమో తెలుసా?
ఎ) సాహసం శ్వాసగా సాగిపో బి) దడ     సి) బెజవాడ డి) ఏ మాయ చేసావె

► ఎన్టీఆర్‌ హిట్‌ సాంగ్‌ ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటకు మళ్లీ డాన్స్‌ చేసిన తమిళ టాప్‌ హీరో?
ఎ) రజనీకాంత్‌ బి) కమలహాసన్‌  సి) శరత్‌ కుమార్‌ డి) విజయ్‌

► ‘కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం’ – ఈ డైలాగ్‌ ఏ సినిమా లోనిది?
ఎ) తీన్‌మార్‌  బి) అత్తారింటికి దారేది సి) గబ్బర్‌సింగ్‌ డి) జల్సా

► ‘ఆల్‌ ఐ వాంట్‌ ఈస్‌ ఎవ్విరి థింగ్‌ ’ అనే ఇంగ్లీష్‌ షార్టు ఫిలిమ్‌ను నిర్మించింది తెలుగు యాంకర్‌? ఆమె ఎవరు?
ఎ) సుమ బి) అనసూయసి) ఝాన్సీ   డి) శిల్పా

► చక్రవర్తి ఈ ఫొటోలో ముద్దుగా ఉన్న పాప ఇప్పుడు హీరో యిన్‌. ఎవరో గుర్తుపట్టగలరా?
ఎ) అవికా గోర్‌ బి) ఉదయభాను సి) భావనడి) అంజలా ఝవేరి

► అభయ్‌రామ్‌ అనే పేరు ఓ స్టార్‌ నటుడు కుమారునిది. ఎవరా స్టార్‌?
ఎ) కళ్యాణ్‌రామ్‌   బి) అల్లు అర్జున్‌ సి) మహేశ్‌ బాబు డి) యన్టీఆర్‌

► సావిత్రి నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమా లోనిదో గుర్తు పట్టండి?
ఎ) ఆత్మీయులు  బి) మనసు మమత  సి) అంతరంగాలుడి) చివరకు మిగిలేది

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) డి  2) సి  3) బి  4) డి  5)  బి  6) బి  7) డి  8) సి   9) సి  10) బి  11) ఎ  12) బి  13) బి  14) డి  15) ఎ  16) ఎ  17)  సి  18) ఎ  19)  డి  20) డి

మరిన్ని వార్తలు