న్యూ లుక్లో పటాస్ హీరో

1 Jun, 2016 20:29 IST|Sakshi
న్యూ లుక్లో పటాస్ హీరో

యంగ్ హీరో కళ్యాణ్ రామ్ తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. పటాస్ హిట్తో ఫాంలోకి వచ్చిన నందమూరి హీరో ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. మే 26 నుంచి నానక్ రామ్ గూడ స్టూడియోలో ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు రీమిక్స్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్గా నటిస్తున్న ఈ సినిమాతో 2015 మిస్ ఇండియా వరల్డ్ అదితి ఆర్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. పూరి మార్క్ హీరోయిజంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. గతంలో ఎన్నడూ కనిపించనంత ట్రెండీగా కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పటి వరకు రివీల్ చేయని కళ్యాణ్ రామ్ లుక్ను మంగళవారం ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు పూరి.