'రోగ్' ఎవరో తేల్చేశాడు

6 Oct, 2015 11:11 IST|Sakshi
'రోగ్' ఎవరో తేల్చేశాడు

జెట్ స్పీడ్తో సినిమాలు పూర్తి చేసే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అదే స్పీడు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం వరణ్తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న పూరి, ఆ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ సినిమాను ప్రకటించేశాడు. చాలా రోజులుగా చిరంజీవి 150 సినిమా విషయంలో క్లారిటీ కోసం ఎదురుచూసిన పూరి ఆ సినిమా ఎంతకీ ఫైనల్ కాకపోవటంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టిపెట్టాడు.

చిరు సినిమాతో పాటు మహేష్తో కూడా ఓ సినిమా చేస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించాడు పూరి. అంతేకాదు ఈ సినిమాకు 'రోగ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. 'పోకిరి' సీక్వల్గా ఈ సినిమా తెరకెక్కనుందని అప్పట్లో భారీ చర్చ జరిగింది. అయితే ఈ గాసిప్స్ అన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ, తన నెక్ట్స్ సినిమాను స్వయంగా ప్రకటించాడు పూరి.

ఇప్పటికే తన ట్విట్టర్ లో తన నెక్ట్స్ సినిమా టైటిల్ తో పాటు హీరోను కూడా ఎనౌన్స్చేశాడు. 'రోగ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఇషాన్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు పూరి జగన్నాథ్. తెలుగులో మహాత్మ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించిన కన్నడ నిర్మాత, నటుడు సిఆర్ మనోహర్ తనయుడే ఈ ఇషాన్. గతంలో 'చిరుత' సినిమాతో రామ్చరణ్ను  గ్రాండ్గా లాంచ్ చేసిన పూరి చాలా కాలం తరువాత మరో స్టార్ వారసున్ని వెండితెరకు పరిచయం చేస్తున్నాడు.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి