పోస్టర్‌ బాగుంది – పూరి జగన్నాథ్‌

30 Jan, 2018 00:49 IST|Sakshi
పూరి జగన్నాథ్, సిద్ధార్థ్, పూర్ణానంద్, కార్తీక్‌రాజ్‌

కార్తీక్‌రాజ్, మిస్తీ చక్రవర్తి జంటగా రూపొందిన చిత్రం ‘దీర్ఘ ఆయుష్మాన్‌ భవ’. పూర్ణానంద్‌ .ఎం దర్శకత్వంలో ప్రతిమ .జి నిర్మించిన ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ రిలీజ్‌ చేశారు.  ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ– ‘‘కార్తీక్‌రాజ్‌ నాకు చాలా రోజులుగా తెలుసు. వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టైటిల్, పోస్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈ సినిమాతో కార్తీక్‌కి మంచి గుర్తింపు లభించాలని ఆశిస్తున్నా’’ అన్నారు.

ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌  ‘దీర్ఘ ఆయుష్మాన్‌ భవ’. సినిమా ఆద్యంతం ఫ్రెష్‌ లుక్‌తో ఉంటుంది. సీనియర్‌ నటులు  కైకాల సత్యనారాయణగారు చాలాకాలం తర్వాత యముడిగా కనిపిస్తారు. ఆయన పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మార్చిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘గమ్మత్తెన ప్రేమకథగా పూర్ణానంద్‌గారు ఈ సినిమా రూపొందించారు. వైవిధ్యంగా ఉండే ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు కార్తీక్‌రాజ్‌.

మరిన్ని వార్తలు