రామ్‌ ఎనర్జీ సినిమాను నిలబెట్టింది

4 Aug, 2019 02:08 IST|Sakshi
పూరి జగన్నాథ్, చార్మీ, రామ్, నిధీ అగర్వాల్‌

– పూరి జగన్నాథ్‌

‘‘ఈ మధ్యకాలంలో నేను చేసిన రెండు మంచి పనులు.. రామ్‌ని కలవడం ఒకటి, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా చేయడం మరోటి. అందరి ఆదరణతో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది’’ అని పూరి జగన్నాథ్‌ అన్నారు. రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. నభా నటేశ్, నిధీ అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. పూరి, చార్మి నిర్మించిన ఈ చిత్రం జూలై 18న రిలీజైంది. సక్సెస్‌ఫుల్‌ టాక్‌తో 75 కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు పూరి మాట్లాడుతూ – ‘‘సినిమా చూసి నా ఫ్రెండ్స్‌ అందరూ అభినందిస్తున్నారు. రామ్‌ ఎనర్జీ ఈ సినిమాను నిలబెట్టింది. సినిమాలో రామ్‌ క్యారెక్టర్‌ గురించి అందరూ మాట్లాడుకోవడం ఆనందం అనిపించింది’’ అన్నారు. ‘‘సినిమా చూశాక ఎలా ఫీల్‌ అయ్యానో, ఆడియన్స్‌ రెస్పాన్స్‌ చూశాక అలాంటి ఫీలింగే కలిగింది. గతంలో నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా, నా పాత్ర ఉన్నాయి. దానికి కారణం పూరీగారు. కొత్త క్యారెక్టరైజేషన్‌తో∙నన్ను కొత్తగా స్క్రీన్‌ మీద చూపించారు.

నా మంచి కోరుకునే వాళ్లందరికీ ఈ సక్సెస్‌ను అంకితం ఇస్తున్నాను. మణిశర్మ సంగీతం, హీరోయిన్స్‌ గ్లామర్‌ ఈ సక్సెస్‌కు యాడ్‌ అయ్యాయి. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు రామ్‌. ‘‘మా సినిమాను బ్లాక్‌బస్టర్‌ చేసిన అందరికీ థ్యాంక్స్‌. రామ్‌ కెరీర్‌ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. పూరీగారు రామ్‌ పాత్రను కొత్తగా రూపొందించారు. అదే సినిమా సక్సెస్‌కు ముఖ్య కారణం. రామ్‌ సొంత బ్యానర్‌ స్రవంతి మూవీస్, సెకండ బ్యానర్‌ పూరి కనెక్ట్స్‌’’ అన్నారు చార్మి. ‘‘నాకు చాలా ఇంపార్టెంట్‌ టైమ్‌లో వచ్చిన హిట్‌ ఇది. ఇంత మంచి సక్సెస్‌ ఇచ్చిన పూరీగారికి, సపోర్ట్‌ చేసిన చార్మీగారికి థ్యాంక్స్‌’’ అన్నారు నిధీ.

మరిన్ని వార్తలు