'హ్యాట్సాఫ్' సీఎం సార్ : పూరి జ‌గ‌న్నాథ్

1 Jul, 2020 17:39 IST|Sakshi

అత్యాధునిక సాంకేతిక​ పరిజ్ఞానంతో 108,104 అంబులెన్సు  స‌ర్వీసుల‌ను  ప్రారంభించిన  ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గన్‌మోహ‌న్ రెడ్డిపై ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌పంచ‌మంతా క‌రోనా సంక్షోభంతో పోరాడుతున్న స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల కోసం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తున్న తీరు అభినంద‌నీయం అంటూ ట్వీట్ చేశారు. జాతీయ వైద్యుల దినోత్సవం సంద‌ర్భంగా  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1,088 అంబులెన్స్‌లను బుధవారం విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. క్లిష్ట స‌మ‌యంలోనూ వైఎస్ జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లుచేస్తున్న  తీరుపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది.
 (దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్‌ )

ప్ర‌జ‌ల‌కు ఎంతో అత్య‌వ‌స‌ర‌మైన అంబులెన్సు స‌ర్వీసుల‌ను  ఒకేరోజు 1,008 వాహ‌నాల‌ను ప్రారంభించ‌డం ప‌ట్ల  సంగీత దర్శ‌కుడు ఎస్‌.ఎస్ త‌మ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు వైఎస్ జ‌గ‌న్‌ను కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలోఓ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన వైద్య‌సేవ‌లు అందించ‌డానికి 108,104 స‌ర్వీసుల‌ను ప్రారంభించ‌డాన్ని ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ అభినందించారు. మిగ‌తా రాష్ర్టాలు సైతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఆద‌ర్శంగా తీసుకుని ఇదే బాట‌లో న‌డుస్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. (ఏపీ సర్కారుపై సర్దేశాయ్ ప్రశంసల జల్లు )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు