వేసవి బరిలో జూనియర్

9 Sep, 2016 11:54 IST|Sakshi
వేసవి బరిలో జూనియర్

జనతా గ్యారేజ్ ఘనవిజయం సాధించటంతో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ నిర్మాణంలో సినిమా చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త దర్శకుడితో ప్రయోగం చేయటం కన్నా సీనియర్ దర్శకుడితో సినిమా చేయటమే కరెక్ట్ అని భావిస్తున్నాడట.

ఇటీవల రిలీజ్ అయిన ఇజం టీజర్కు మంచి స్పందన రావటంతో తన నెక్ట్స్ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే చేయాలని భావిస్తున్నాడట. ఇజం షూటింగ్ ఆఖరి దశకు చేరుకోవటంతో అక్టోబర్లో ఎన్టీఆర్, పూరిల సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేసి వచ్చే వేసవినాటికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..

అదో బోరింగ్‌ టాపిక్‌

తోట బావి వద్ద...

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!