కరోనా ఎఫెక్ట్‌: పూరీ కనెక్ట్స్‌కు బ్రేక్‌

17 Mar, 2020 16:23 IST|Sakshi

కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడ్డాయి, షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. అటు వైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం 15 రోజులు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పూరీ కనెక్ట్స్‌(పీసీ) సంస్థ కూడా అదే బాటలో నడిచింది. పీసీ బ్యానర్‌లో అడ్మినిస్ట్రేషన్‌, ప్రొడక్షన్‌ వర్క్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మంగళవారం వెల్లడించింది. తమ సిబ్బంది, నటీనటుల భద్రత దృష్ట్యా కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటన చేసింది. కరోనాపై యుద్ధంలో గెలవాలంటే సమిష్టిగా పోరాడదామని పూరీ, చార్మీ పిలుపునిచ్చారు.(నిత్యానందను ఒకసారి కలవాలనుంది: నటి)

కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొల్పుతున్న కరోనా వైరస్‌పై ప్రభుత్వ సూచనలను పాటించాలని ప్రజలకు సూచన చేశారు. ఈ నిర్ణయంతో పీసీ(పూరీ కనెక్ట్‌) ఆఫీసుకు తాళం పడినట్లయింది. కాగా చార్మీ ఈ మధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో సన్నిహితంగా మెలుగుతున్న చార్మీ ఆయనతో కలిసి పూరీ కనెక్ట్స్‌ అనే సంస్థను స్థాపించింది. ఈ బ్యానర్‌ కొత్త వారిని ఎంకరేజ్‌ చేయడమే కాక ఇస్మార్ట్‌ శంకర్‌ వంటి హిట్‌ సినిమాలనూ అందిస్తోంది. (ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..)

మరిన్ని వార్తలు