చీల్చి చెండాడటానికి ‘ఫైటే’ అక్కర్లేదు..

18 May, 2020 12:33 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌పై ప్రముఖ నిర్మాత పీవీపీ ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్‌ ట్యాలెంట్‌ను అభినందించిన పీవీపీ ఎంతో మంది నిర్మాతలు ఆయనతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడ గురించి బ్రహ్మాండంగా చెప్పావు హరీష్‌. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయింటింగ్‌. తమ్ముడు స్టార్ట్‌‌ యూవర్‌ కుమ్ముడు’ అని పేర్కొన్నారు. 

పీవీపీ ట్వీట్‌పై స్పందించిన హరీష్‌.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ 'భాష,భావం' రెండూ నన్ను అలరించాయి. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం’ అని పేర్కొన్నారు. కాగా, ఇటీవల హరీష్‌ నైపుణ్యాన్ని తక్కువ చేసేలా నిర్మాత బండ్ల గణేష్‌ సోషల్‌ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీపీ తన ట్వీట్‌ ద్వారా హరీష్‌ ట్యాలెంట్‌ను గుర్తుచేయడంతోపాటు బండ్ల గణేష్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చాడని అభిమానులు అంటున్నారు. (చదవండి : వర్మ మరో సంచలనం.. క్లైమాక్స్‌ ట్రైలర్)

కాగా, మే 11తో గబ్బర్‌సింగ్ చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్‌ను గుర్తుచేసుకుంటూ హరీష్ శంకర్ ఒక లేఖను విడుదల చేశారు. అయితే అందులో బండ్ల గణేష్ పేరు మిస్సయింది. జరిగిన పోరపాటును గుర్తించిన హరీష్‌ మరో ట్వీట్‌లో బండ్ల గణేష్ గురించి ప్రస్తావించారు. అయితే అప్పటికే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా హరీష్‌పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. హరీష్‌కు తను అవకాశం ఇవ్వకపోతే సినిమాలే లేవని కామెంట్‌ చేశాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు