పీవీఆర్‌ సినిమాస్‌, సినీపొలిస్‌లకు షాక్‌

27 Aug, 2019 10:31 IST|Sakshi

న్యూఢిల్లీ : మూవీ టికెట్లపై జీఎస్టీ కౌన్సిల్‌ పన్ను రేటు తగ్గింపును ప్రకటించినా అందుకు అనుగుణంగా సినిమా టికెట్ల ధరలను తగ్గించలేదని పీవీఆర్‌ సినిమాస్‌, సినిపొలిస్‌ థియేటర్లపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈ రెండు థియేటర్‌ చైన్‌లపై యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ రెండు మల్టీప్లెక్స్‌ సంస్థలు పన్ను తగ్గింపు ప్రయోజనాలను ప్రేక్షకులకు మళ్లించలేదని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో న్యూఢిల్లీలోని రెండు సంస్థలపై రాష్ట్రస్ధాయి యాంటీ ప్రాఫిటీరింగ్‌ కమిటీ ప్రాధమిక దర్యాప్తును పూర్తిచేసింది. పీవీఆర్‌ థియేటర్లలో సింబా మూవీ టికెట్ల ధరలను తగ్గించలేదని, ఢిల్లీలోని సాకేత్‌లో సినీపొలిస్‌పై కూడా ఇదే తరహా ఫిర్యాదు అందినట్టు అధికారులు తెలిపారు. ప్రేక్షకులకు సినిమా వినోదం భారం కాకూడదనే ఉద్దేశంతో రూ 100కిపైగా ఉన్న మూవీ టికెట్లపై జీఎస్టీని ఈ ఏడాది జనవరి 1 నుంచి 28 శాతం పన్ను శ్లాబు నుంచి 18 శాతం పన్ను శ్లాబుకు మార్చారు. ఇక తక్కువ ఖరీదు కలిగిన టికెట్లపై జీఎస్టీ శ్లాబును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో తమ స్క్రీన్లలో జనవరి 1కి ముందు, తర్వాత సినిమా టికెట్ల ధరలపై పూర్తి వివరాలు అందచేయాలని ఈ రెండు మల్టీప్లెక్స్‌ సంస్థలను రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీ కోరిందని అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆయా సంస్థలు ఎంతమేర లబ్ధిపొందాయో లెక్కగట్టి అందులో కొంత మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి జమచేస్తామని చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సూర్య చిత్రానికి అడ్డంకులు

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

మరో సినిమాతో వస్తా!

కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం

కీర్తీ... మిస్‌ ఇండియా

నవ్వుల్‌ నవ్వుల్‌

మంచి సందేశంతో మార్షల్‌

చీమ మనిషిగా మారితే...!

టెన్నిస్‌ ఆడతా!

తెలుగులో లస్ట్‌ స్టోరీస్‌

వారిద్దరు విడిపోయారా?!

ప్లాన్‌ మారింది

బిగ్‌బాస్‌.. నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్‌బాస్‌.. ఆ నలుగురు విడిపోనున్నారా?

ఆ చేదు సంఘటన ఇంకా మర్చిపోలేదు

ఆ వార్తల్లో నిజం లేదు : బోనీ కపూర్‌

కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’!

విడుదలైన సాహో రొమాంటిక్‌ పాట!

బిగ్‌బాస్‌.. రాహుల్‌ ప్రతీకారం తీర్చుకోనున్నాడా?

అట్టహాసంగా ‘మార్షల్‌’ ఆడియో ఆవిష్కరణ 

‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్‌

‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’

బిగ్‌బాస్‌ నిర్వాహకులతో మాకు ఆ సమస్య లేదు! 

మన ఫ్యాషన్‌ మెచ్చెన్ నేషన్

వేసవికి వస్తున్నాం

ఉప్పు తగ్గింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సూర్య చిత్రానికి అడ్డంకులు

పీవీఆర్‌ సినిమాస్‌, సినిపొలిస్‌లకు షాక్‌

మరో సినిమాతో వస్తా!