ష్‌ష్‌ష్‌.. సౌండ్‌ చెయ్యొద్దు

9 Apr, 2018 00:36 IST|Sakshi
‘ఎ క్వైట్‌ ప్లేస్‌’ లో ఓ దృశ్యం

హాలీవుడ్ ‌స్పైస్‌

చుట్టూ నిశ్శబ్దం. ఎక్కడ చూసినా ఒక్క మాట కూడా వినబడకూడదు. ఆ ఫ్యామిలీ అంతా అక్కడే బతుకుతోంది. చిన్న శబ్దమైనా వినిపించిందా.. ఇక అంతే! చిన్న శబ్దం.. అంటే అడుగుల చప్పుడు కూడా కావొచ్చు. అలాంటి శబ్దం ఒక్కటి బయటకొచ్చినా దెయ్యం వచ్చేస్తుంది. వెంటాడుతుంది. ఇంట్లో పిల్లలున్నారు. గర్భిణీ కూడా ఉంది. శబ్దం చేయకుండా ఒక కుటుంబమంతా ఉండగలుగుతుందా? అలాంటి పరిస్థితే వచ్చి దెయ్యాలు వెంటాడితే ఎలా ఉంటుంది? కథే భయపెట్టేస్తోంది కదూ!! ఇంక సినిమా చూసి కూడా భయపడేద్దాం అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా ‘ఎ క్వైట్‌ ప్లేస్‌’కి టికెట్స్‌ బుక్‌  చేస్కోండి.

ఏప్రిల్‌ 6న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా హారర్‌ సినిమాలను ఇష్టపడేవారిని తెగ ఆకట్టుకుంటోంది. రిలీజ్‌ రోజు నుంచే సూపర్‌ పాజిటివ్‌ టాక్‌తో భారీ వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతోంది. జాన్‌ క్రసిన్కి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎమిలీ బ్లంట్, జాన్‌ క్రసిన్కి కీలక పాత్రల్లో నటించారు. మీరు హారర్‌ సినిమాలను ఇష్టపడేవారైతే తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందేనని హాలీవుడ్‌ రివ్యూలు సలహా ఇచ్చేస్తున్నాయి. మరింకేం నిశ్శబ్దంగా థియేటర్లకు వెళ్లిపోండి, భయపడిపోడానికి!!
 

మరిన్ని వార్తలు