20 ఏళ్ల సినీ ప్రస్థానం రెండు నిమిషాల్లో...

6 Jul, 2020 14:49 IST|Sakshi

నటుడు ఆర్‌ మాధవన్‌ అంటే సినీ పరిశ్రమలో తెలియని వారుండరు. సీరియల్‌ యాక్టర్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మాధవన్‌ సినీ నటుడిగా ఎదిగి వివిధ బాషలో నటించారు. నటన జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే ఆయన సినీ ప్రస్థానానికి సంబంధించి ఈ 20 ఏళ్లలో చేసిన సినిమాలను 2 నిమిషాల కన్నా తక్కువ నిడివిలో తెలిపే ఒక వీడియోని మాధవన్‌ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను హియాచద్దా రూపొందారు. దీనికి వాటర్‌ మిలన్‌ షుగర్‌ అని పేరు పెట్టారు. ఈ వీడియో వెనుక వినిపిస్తున్న సాంగ్‌ను హారీ స్టైల్స్‌ పాడారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన మాధవన్‌ వీడియోను రూపొందిన హియా చద్దాకు కృతజ్ఙతలు తెలిపారు. (ఆ అమ్మాయి ఒక్కటే చేసిందంటారా?)

‘20 యేళ్ల ప్రస్థానాన్ని 2 నిమిషాల్లో చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన తరువాత అభిమానులు మాధవన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీని పై స్పందించిన ఒక అభిమాని మీరు మూడు నిమిషాలలో చాలా హృదయాలను గెలుచుకున్నారు అని కామెంట్‌ చేశాడు. మాధవన్‌ 90వ దశకంలో జీనే భీ దో యారో అనే హిందీ సీరియల్‌లో నటించారు. అలాగే కొన్ని సీరియల్స్‌ చేసిన అనంతరం ‘ఇన్‌ఫెర్నో’ సినిమాతో 1997లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మాధవన్‌ సఖి, చెలి వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించాడు.  (మాది తొలి హాలీవుడ్‌ క్రాస్‌ఓవర్‌ చిత్రం)


 

Thank you so much Hiya Chadha. 20 years of a career in less than 2 min. Nostalgic ..❤️❤️❤️🙏🙏

A post shared by R. Madhavan (@actormaddy) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా