సోలో డైరెక్టర్‌గా..

22 Jan, 2019 03:56 IST|Sakshi
మాధవన్‌

నంబీ నారాయణ్‌ బయోపిక్‌కు అనంత్‌ మహాదేవన్‌తో పాటు ఓ దర్శకుడిగా వ్యవహరిస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు మాధవన్‌. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు పూర్తి స్థాయి డైరెక్టర్‌గా వ్యవహరించి సినిమాను పూర్తి చేస్తారట. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్‌’. ‘‘అనంత్‌ అద్భుతమైన ఫిల్మ్‌ మేకర్‌. కొన్ని అనివార్య కారణలతో దర్శకుడు అనంత్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. ఈ సినిమాను నేను డైరెక్ట్‌ చేయనున్నాను’’ అని పేర్కొన్నారు మాధవన్‌. ఈ సినిమాలో మాధవన్‌ సరసన సిమ్రాన్‌ హీరోయిన్‌గా కనిపించనున్నారు. సమ్మర్‌లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు