కనుక్కోండి చూద్దాం

23 Jan, 2019 01:30 IST|Sakshi

... అనేది మీ ముందున్న సవాల్‌. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నారాయణన్‌ పాత్రలో మాధవన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్‌గా నారాయణన్‌ లుక్‌లోకి మారిపోయారాయన. ఇక్కడున్న ఫొటోని షేర్‌ చేసి, ఎవరో కనిపెట్టగలరా? అంటూ తన నయా లుక్‌ను విడుదల చేశారు మాధవన్‌.

అచ్చంగా నంబి నారాయణన్‌లానే మౌల్డ్‌ అయ్యారు కదూ. ఈ చిత్రానికి అనంత మహదేవన్‌తో పాటు మాధవన్‌ కూడా దర్శకుడిగా చేయాలనుకున్నారు. అయితే మహదేవన్‌ తప్పుకోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు