జీరో కోసం కలిశారు 

23 May, 2018 00:40 IST|Sakshi
ఆనంద్‌ ఎల్‌. రాయ్, మాధవన్‌

మూడేళ్ల క్రితం హిందీలో రిలీజైన ‘తను వెడ్స్‌ మను: రిటర్న్స్‌’ చిత్రంలో మాధవన్‌ హీరోగా నటించారు. ఆ చిత్రానికి ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకుడు. ఇప్పుడు మళ్లీ వీళ్లు కలిశారు. ఆల్రెడీ ‘తను వెడ్స్‌ మను’ చిత్రానికి ‘తను వెడ్స్‌ మను: రిటర్న్స్‌’ చిత్రం సీక్వెల్‌. ఇప్పుడు మళ్లీ..‘తను వెడ్స్‌ మను’ ఫ్రాంచైజీలో మరో సీక్వెల్‌ రాబోతుందా? అంటే.. కానే కాదు. ఆనంద్‌–మాధవన్‌ కలిసింది ‘జీరో’ కోసం. షారుఖ్‌ ఖాన్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్‌ ముఖ్య తారలుగా ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జీరో’.

ప్రజెంట్‌ యూఎస్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు మాధవన్‌. ‘‘తను వెడ్స్‌ మను: రిటర్న్స్‌’ మూవీ వచ్చి మూడేళ్లు అయ్యింది. మళ్లీ మ్యాడీ (మాధవన్‌)తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు దర్శకుడు ఆనంద్‌. ‘జీరో’ ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్‌ కానుంది. 

మరిన్ని వార్తలు