‘నిరాశ పడకండి ఆట ఇంకా మొదలు కాలేదు’

16 Jul, 2020 15:18 IST|Sakshi

మార్కులు అనేవి జీవిత ఆశయాలను వెనక్కి తగ్గించలేవంటూ విద్యార్థులకు హీరో ఆర్‌ మాధవన్‌ ట్విటర్‌ ద్వారా సందేశం ఇచ్చారు. బుధవారం సీబీఎస్‌సీ 10వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాధవన్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. అలాగే తక్కువ మార్కులు వచ్చిన వారు నిరాశ చెందొద్దంటూ మ్యాడీ తన 10వ తరగతి మార్కులను ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘సీబీఎస్‌సీ బోర్టు వెల్లడించిన ఫలితాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికి అభినందనలు. నాకు 10వ తరగతిలో 58 శాతం మార్కులు వచ్చాయి. తక్కువ  మార్కులు వచ్చిన వారు నిరాశ చెందకండి. ఎందుకంటే ఆట అప్పుడే మొదలు కాలేదు మిత్రులారా’ అంటూ గురువారం ట్వీట్‌ చేశాడు. (చదవండి: చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..)

అది చూసిన నెటిజన్లు మాధవన్‌కు మద్దతునిస్తున్నారు. ‘జీవితంలో అద్భుతాలు చేయడానికి మీ పోస్టు ప్రేరణ’  ‘మార్కులు కేవలం సంఖ్యలు మాత్రమే... పెద్ద సంఖ్య భవిష్యత్తులో దేనికీ హామీ ఇవ్వదు, తక్కువ సంఖ్యతో జీవితం అంతం కాదు.. వీటిని కేవలం మార్కులు గానే చూడాలి. ఇవి కేవలం మార్కులే’ ‘మీరు జీవితంలో ఎదగాలంటే మార్కులు కాదు ముఖ్యం తెలివి, అణకువ,  విలువలు, కష్టపడి పనిచేయడం ఉంటే జీవితంలో అంతకంటే ఎక్కువ మార్కులు సాధిస్తారు’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. (చదవండి: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల)

మరిన్ని వార్తలు