ఈసారి వినిపిస్తా!

9 Nov, 2018 02:50 IST|Sakshi
మాధవన్‌

‘సవ్యసాచి’తో తొలిసారి స్ట్రయిట్‌ తెలుగు చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించారు మాధవన్‌. ఈ చిత్రంలో మాధవన్‌ పోషించిన నెగటివ్‌ పాత్రకు మంచి అభినందనలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మాధవన్‌ ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌’ అనే చిత్రంలో యాక్ట్‌ చేస్తున్నారు. శాస్త్రవేత్త నంబీ నారాయణ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనంత్‌ మహదేవ్‌తో కలసి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు మాధవన్‌.

ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు మాధవన్‌ సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోనున్నారు. ‘‘సవ్య సాచి’ సినిమాలో పాత్రకు డబ్బింగ్‌ చెప్పాలనుకున్నా అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా సినిమాలను ఫాలో అయ్యేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారని తెలుసుకున్నాను. అందుకే ‘రాకెట్రీ’ సినిమాలో నా గొంతునే వినిపిస్తాను’’ అని మాధవన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు