స్పేస్‌ జర్నీ ముగిసింది

21 Jun, 2019 03:17 IST|Sakshi

‘రాకెట్రీ’లో మాధవన్‌ అంతరిక్ష ప్రయాణం సెర్బియాలో ముగిసింది. మాధవన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. ఈ చిత్రానికి దర్శకుడు కూడా మాధవనే కావడం విశేషం. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. నారాయణన్‌ పాత్రలో మాధవన్‌ నటించారు. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మాధవన్, సిమ్రాన్‌ జంటగా నటించిన చిత్రం ఇది.

ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కన్నత్తిల్‌ ముత్తమిట్టాళ్‌’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో మాధవన్, సిమ్రాన్‌ నటించారు. ‘‘రాకెట్రీ సినిమా ముగిసింది. నా జీవితంలోనే అత్యద్భుతంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. నా హృదయం ఎన్నో భావోద్వేగాలతో నిండిపోయింది’’ అన్నారు మాధవన్‌. ఇందులో హాలీవుడ్‌ యాక్టర్లు రాన్‌ డోనాచీ (గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ఫేమ్‌), ఫిలిస్‌ లోగాన్‌ కీలక పాత్రలు చేశారు.

మరిన్ని వార్తలు