కొత్త లుక్‌

11 Dec, 2018 03:49 IST|Sakshi
మాధవన్‌

ఇస్రోకి (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) చెందిన ప్రముఖ    శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. టైటిల్‌ రోల్‌లో మాధవన్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్‌ పనుల్లో బీజీగా ఉన్నారాయన. ఈ మేకోవర్‌కు చెందిన ఓ వీడియోను మాధవన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘నా క్యారెక్టర్‌కు చెందిన కొత్త లుక్‌ కోసం రెడీ అవుతున్నాను. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా అనంత్‌ మహాదేవన్‌తో పాటు హీరో మాధవన్‌ కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం విశేషం. ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా మాధవన్, అనుష్క ప్రధాన తారలుగా ‘సైలెన్స్‌’ అనే కొత్త చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు