నా భర్తను నేనే చంపేశాను.!

5 Nov, 2019 18:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సత్యదేవ్, తెలుగమ్మాయి ఇషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’ థియేట్రికల్‌  ఆకట్టుకుంటోంది. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను  చిత్ర  యూనిట్‌  మంగళవారం విడుదల చేసింది.  సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తాజా ట్రైలర్‌ కొంచెం ఇంట్రస్టింగ్‌గాను..అంతే థ్రిల్లింగ్‌నూ ఆసక్తి రేపుతోంది. ఇషా రెబ్బా నటనలో మరో మెట్టు ఎక్కినట్టు కనిపిస్తోంది. కాగా శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ  నవంబర్ 15న  విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు