వేడి వేడి జిలేబీలా కొనేస్తారు

26 Aug, 2019 00:11 IST|Sakshi
కృతి, అభిరామ్‌

‘‘చిన్న సినిమా హిట్‌ అయిన తర్వాత బావుంది అని అందరూ అంటారు. కానీ దాన్ని షూటింగ్‌ వరకూ తీసుకురావడం చాలా కష్టం. ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చిందంటే దర్శకుడి శక్తి, నిర్మాతల నమ్మకం కనిపిస్తోంది’’ అన్నారు రచయిత బీవీఎస్‌ రవి. కృతి గార్గ్, అభిరామ్‌ వర్మ, కాలకేయ ప్రభాకర్‌ నటించిన చిత్రం ‘రాహు’.  ఏవిఆర్‌ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు వేదుల దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ను బీవీఎస్‌ రవి విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘టీజర్‌ బావుంది.

వేడి వేడి జిలేబీలా ఈ సినిమాను కొనేస్తారని అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘నిర్మాతలు చాలా ఇష్టంతో తీశారు. సూపర్‌ హిట్‌ అవుతుందని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్‌. ‘‘ఓ ఫోటో వేయి మాటలు చెబుతుంది అంటారు. మా సినిమా ఏంటో మా టీజర్‌ మాట్లాడుతుంది. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు సుబ్బు వేదుల. ‘‘నా సామర్థ్యాన్ని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక– నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు కృతి. ‘‘మాకు సినిమా గురించి పెద్దగా తెలియదు. సుబ్బు కథ చెప్పారు. మేం సపోర్ట్‌ చేశాం’’ అన్నారు నిర్మాత స్వామి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు