రాహు జాతకాల సినిమా కాదు

24 Feb, 2020 06:08 IST|Sakshi
అభిరామ్‌ వర్మ

‘‘మను’ సినిమాలో నా నటన నచ్చి దర్శకుడు సుబ్బుగారు ఆడిష¯Œ ్సకి పిలిచారు. సుబ్బు కూడా సినిమా మీద ఫ్యాషన్‌తో నాలాగే అమెరికా నుండి  ఇండస్ట్రీకి వచ్చారు. ‘రాహు’ సినిమా చూస్తే కొత్త దర్శకుడు తీసినట్టు అనిపించదు.. అంత బాగా తీశాడు’’ అని అభిరామ్‌ వర్మ అన్నారు. సుబ్బు వేదుల దర్శకత్వంలో  అభిరామ్‌ వర్మ, కృతి గార్గ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాహు’. ఏవీఎస్‌ఆర్‌ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా అభిరామ్‌  వర్మ మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఫిలిమ్స్‌లో మాస్టర్స్‌ చేశాను. ‘మిస్టర్‌ ఆంధ్ర’గా సెలెక్ట్‌ అయ్యాను.. ‘మిస్టర్‌ ఇండియా’ ప్రయత్నాల్లో ఉండగా దర్శకుడు తేజ గారి నుండి ‘హోరా హోరీ’ కోసం కాల్‌ వచ్చింది. ఆ తర్వాత ‘మను’, ఇప్పుడు ‘రాహు’ చేశా. సినిమాలో లవర్‌ బాయ్‌లా మొదలైన నా పాత్ర యాక్షన్‌కి టర్న్‌ అవుతుంది. ఇది మహిళల కోసం తీసిన చిత్రం. కృతి పాత్రలో చాలా సవాళ్లు ఉన్నాయి. చాలా మంది అనుకున్నట్లు ఇది జాతకాల సినిమా కాదు..  ‘రాహు’ టైటిల్‌ బాగా సరిపోతుందని పెట్టాం. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు