డేటింగా..? ఎప్పుడు కలిశానో గుర్తే లేదు

6 Dec, 2015 09:16 IST|Sakshi
డేటింగా..? ఎప్పుడు కలిశానో గుర్తే లేదు

రాశీ ఖన్నాకు తెలుగు పరిశ్రమ తెగ నచ్చేసినట్లుంది. అందుకే ఢిల్లీ నుంచి ఇక్కడకు షిఫ్ట్ అయిపోయారు. ఒంటరిగా కాదు.. అమ్మా, నాన్నతో కలిసి ఇక్కడే ఉంటున్నారు. తెలివైన నిర్ణయం అనే చెప్పాలి. నిర్మాతలకు అందుబాటులో ఉంటారు కాబట్టి, అవకాశాలు ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక, ఆమె నటించిన తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’ ఈ నెల 10న విడుదల కానుంది. రవితేజ, తమన్నా, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో రాధామోహన్ ఈ చిత్రం నిర్మించారు. ఇక.. రాశీ ఖన్నా చెప్పిన ముచ్చట్లు తెలుసుకుందాం...
 
నేను యాక్ట్ చేసిన ‘జిల్’ చూసి, సంపత్ నంది ‘బెంగాల్ టైగర్’లో నటించే అవకాశం ఇచ్చారు. అప్పటికే తమన్నాను సెలక్ట్ చేశారు. అయినప్పటికీ కథ వింటానన్నాను. 20 నిమిషాలు నేరేట్ చేశారు. రవితేజతో అంటే బిగ్ ప్రాజెక్ట్ కదా. అందుకే ఒప్పుకున్నా. ఈ సినిమాలో తమన్నా పాత్ర ఎలా ఉంటుంది? అని దర్శకుణ్ణి అడగలేదు. నా పాత్ర బాగుంది. అది చాలనుకున్నాను.
 
షూటింగ్ చేయడం మొదలుపెట్టాక తమన్నా ఎంత స్వీట్ పర్సనో నాకర్థమైంది. హెయిర్ స్టయిల్స్, డ్యాన్స్ మూమెంట్స్ పరంగా టిప్స్ ఇచ్చేది. రవితేజ, తమన్నా మంచి డ్యాన్సర్స్. ‘రాయె.. రాయె...’ పాటలో వాళ్లకు దీటుగా డ్యాన్స్ చేయడానికి నేను చాలా రిహార్సల్స్ చేయాల్సి వచ్చింది. వాళ్లేమో సునాయాసంగా చేసేశారు. తమన్నాకు ఎన్నో చిత్రాల అనుభవం ఉంది. మానిటర్‌లో నా సీన్ చూసి, ‘చాలా బాగా చేశావ్. అందంగా ఉన్నావ్’ అని ప్రశంసించేది. నాకు డ్యాన్స్ స్టెప్స్ కూడా నేర్పించింది. ఏ కథానాయిక అలా చేస్తుందో చెప్పండి. ఇద్దరు కథానాయికలు కలిసి సినిమా చేస్తే, ఇద్దరికీ పడదు కదా అని నాతో చాలామంది అన్నారు. కానీ, తమన్నాకూ, నాకూ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ సినిమా నాకో పార్టీలా అనిపించింది.
 
రవితేజ మంచి ఎనర్జీ ఉన్న బాంబులాంటి వ్యక్తి. నేను ఎవరికీ అంత ఈజీగా ఫ్యాన్ అయిపోను. రవితేజకు అయ్యాను. ఎందుకంటే ఆయన మంచి హీరో మాత్రమే కాదు.. మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. రవితేజతో ఉన్నప్పుడు ఆయనకన్నా మనం పెద్దవాళ్లమేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆయన ఎనర్జీ లెవల్స్ అలాంటివి.
 
రకుల్ ప్రీత్‌సింగ్ నటించిన హీరోలందరితోనూ నేను సినిమాలు చేస్తుండటంతో తనేమైనా రికమండ్ చేస్తోందా? అని అడుగుతున్నారు. అసలు ఒక హీరోయిన్‌కి ఇంకో హీరోయిన్ రికమండ్ చేసే పరిస్థితి ఉంటుందా? రకుల్ నాకు మంచి ఫ్రెండే. కాదనడంలేదు. కానీ, రాశీఖన్నాని పెట్టుకోండని ఎలా చెప్పగలుగుతుంది? ప్రొఫెషనల్ మ్యాటర్ గురించి పక్కనపెడితే విడిగా మేం చాలా బాగుంటాం. నేను పార్టీలే చేసుకోను. ఈసారి బర్త్‌డేని పండగలా చేసుకుందామని సందీప్, రకుల్, రవితేజ.. ఇలా అందరూ అన్నారు. దాంతో పార్టీ చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది.
 
కథానాయికలను గ్లామరస్‌గా చూడాలని అందరూ కోరుకుంటారు. అలా కనిపించడానికి నాకేం అభ్యంతరం లేదు. ప్రేక్షకుల కోసం గ్లామరస్‌గా కనిపించడంతో పాటు నటిగా నా సంతృప్తి కోసం డీ-గ్లామరస్ రోల్స్ కూడా చేయాలనుకుంటా. నా మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడె’లో మామూలుగా కనిపించా. ఇప్పుడు ‘సుప్రీమ్’ సినిమాలో పోలీస్‌గా చేస్తున్నాను. సినిమా మొత్తం ప్యాంటు, షర్ట్‌తో కనిపిస్తా. ఈ మధ్య నా డ్రెస్సింగ్ స్టయిల్ మార్చాను. ట్రెండ్‌కి తగ్గట్గు ఉండాలని స్టయిలిస్ట్‌ని పెట్టుకున్నాను.
 
జీవితం అన్నాక జయాపజయాలు రెండూ ఉండాలి. నేను నటించిన సినిమా ఫెయిల్ అయితే అది పూర్తిగా నా చేతుల్లో ఉండదు. ఫెయిల్యూర్ చాలా ఇంపార్టెంట్. అవి ఉంటేనే ఎదగగలుగుతాం. వ్యక్తిగా బెటర్ అవుతాం. నేను చేసిన ప్రతి సినిమా నా కెరీర్‌కి హెల్ప్ అయ్యింది. నా గత చిత్రం ‘శివమ్’తో నటిగా ఇంకా ఎదిగాను. ఇప్పడు ‘బెంగాల్ టైగర్’తో ఇంకా మెరుగయ్యాను. ఇలా సినిమా సినిమాకీ డెవలప్ అవుతూనే ఉంటాను.
 
నాగశౌర్యతో డేటింగ్ చేస్తున్నాననే వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్త నిజం కాదు కాబట్టి, నేను స్పందించలేదు. ఇప్పుడు అడిగారు కాబట్టి.. చెబుతున్నా. చివరిసారి తనను ఎప్పుడు కలిశానో కూడా గుర్తు లేదు. దాన్నిబట్టి మా మధ్య ఏమీ లేదని అర్థం చేసుకోవచ్చు. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదు. సింగిల్‌గా ఉన్నాను. హ్యాపీగా ఉంది. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల పైనే. అందుకే హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. మరో ఏడాది లోపు ఇక్కడ సొంత ఇల్లు కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

వారణాసిలో డిష్యుం డిష్యుం

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..!

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

నోరు జారారు.. బయటకు పంపారు

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!