చరణ్ కోసం చెమటోడుస్తోంది

12 Dec, 2016 15:16 IST|Sakshi

ధృవ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావటంతో, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ లవ్ స్టోరి చేస్తున్నట్టుగా ప్రకటించాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్గా రాశీఖన్నాను ఫైనల్ చేయాలని భావిస్తున్నారు.

ఇప్పటికే రాశీఖన్నాతో ఫోటో షూట్ కూడా చేసిన సుకుమార్, బరువు తగ్గితే హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని కండిషన్ పెట్టాడట. రామ్చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం కావటంతో ఎలాగైన సాధించాలని భావిస్తోంది రాశీ. అందుకే వీలైనంత త్వరగా బరువు తగ్గి, స్లిమ్ లుక్లోకి మారేందుకు జిమ్లో చెమటోడుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధృవ డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతోంది. ధృవ రిలీజ్ తరువాత సుకుమార్, చరణ్ల కాంబినేషన్లో సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.