పాక్‌ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది!

30 Jun, 2018 13:11 IST|Sakshi

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రేస్‌ 3. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారతీయ సినీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. తొలి షో నుంచే డివైడ్‌ టాక్‌ రావటంలో కలెక్షన్ల పరంగా కూడా రేస్‌ 3 వెనకపడింది. సల్మాన్‌ స్టామినా కారణంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా.. భారీ రికార్డ్‌లు నమోదయ్యే అవకాశం మాత్రం కనిపించటంలేదు.

ఇండియన్‌ ఆడియన్స్‌ రిజెక్ట్ చేసిన ఈ సినిమాను పాకిస్తాన్ ప్రేక్షకులు మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇండియాలో రిలీజ్‌ అయిన 8 రోజుల తరువాత పాకిస్తాన్‌లో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు అక్కడ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అక్కడి లోకల్‌ సినిమాల కంటే ఎక్కువగా రేస్‌ 3కే కలెక్షన్లు వస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. టాక్‌ కూడా బాగుండటంతో ముందు ముందు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, డైసీ షాలు కీలక పాత్రల్లో నటించారు.

మరిన్ని వార్తలు