రచ్చ రంబోల

10 Nov, 2014 23:13 IST|Sakshi
రచ్చ రంబోల

‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర ‘రచ్చ రంబోల’ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘రచ్చ రంబోల’ పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. కవల సోదరులైన ధర్మక్షేత్ర, ధర్మరక్షలను దర్శకులుగా పరిచయం చేస్తూ, నానిగాడి సినిమా పతాకంపై బందరు బాబి, నాని కృష్ణ ఈ చిత్రం నిర్మించనున్నారు. సామాజిక సమస్య నేపథ్యం ఉన్న ఈ చిత్రం కథాంశం అన్ని వర్గాలనూ ఆకట్టుకునే విధంగా ఉంటుందని దర్శకులు పేర్కొన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ -‘‘డిసెంబరు 6న చిత్రీకరణ మొదలుపెట్టి ఏకధాటి షూటింగుతో సినిమాను పూర్తి చేస్తాం. ‘ప్రేమ-ఇష్క్-కాదల్’ చిత్రానికి స్వరాలందించిన శ్రవణ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని తెలిపారు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో రే డార్లింగ్‌

అర్ధసెంచరీ కొట్టిన ఆలియా

అమ్మ అవుతారా?

అక్కడ కూడా హీరో రావాల్సిందేనా?

ఆ ఇద్దరంటే ఇష్టం

అప్పుడు సింగపూర్‌... ఇప్పుడు రోమ్‌