అనసూయకు రాచకొండ పోలీసుల అభినందన

15 May, 2020 17:11 IST|Sakshi

హైదరాబాద్‌ : ప్రముఖ యాంకర్‌ అనసూయ భరధ్వాజ్‌ను రాచకొండ పోలీసులు అభినందించారు. నేడు తన పుట్టినరోజు సందర్భగా.. కీసర మండలంలోని పలువురు గర్భిణి స్త్రీలకు అనసూయ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. గర్భిణిలకు సాయం అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనసూయ భర్త సుశాంక్‌ భరధ్వాజ్‌ కూడా పాల్గొన్నారు. ఇందకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన రాచకొండ పోలీసులు.. అనసూయను అభినందించారు. (చదవండి : హిజ్రాలకు శేఖర్‌ కమ్ముల చేయూత)

గర్బిణీ స్రీలకు ప్రస్తుత పరిస్థితుల్లో మరింత సమర్థవంతంగా పోషకాలను అందించి.. వారిలో ధైర్యం నింపేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్టు రాచకొండ పోలీసులు తెలిపారు. నేడు (మే 15) కీసర పీహెచ్‌సీ పరిధిలోని గర్భిణిలకు తన బర్త్‌ డే సందర్భంగా అనసూయ న్యూట్రిషన్‌ కిట్లను అందజేశారని పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ అనసూయ గొప్ప మనసును అభినందించారు. అలాగే ప్రస్తుత పిరిస్థితుల్లో గర్భిణిలు బయటకు రావొద్దని కోరారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని.. ఏదైనా సాయం కావాలంటే పోలీసు కోవిడ్‌ కంట్రోల్‌ నెంబర్‌ 9490617234కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్‌గిరి డీసీపి రక్షిత మూర్తి.. లాక్‌డౌన్‌ సమయంలో మహిళలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 

మరోవైపు అనసూయకు సోషల్‌ మీడియాలో బర్త్‌ డే విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు బుల్లితెరపై యాంకర్‌గా కొనసాగుతూనే.. వెండితెరపై కూడా తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రంగస్థలం చిత్రంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర ఆమె క్రేజ్‌ను మరింతగా పెంచింది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో నటించనున్నట్టుగా తెలుస్తోంది.  (ఫొటోలు : యాంకర్‌ అనసూయ భరధ్వాజ్ అదిరే స్టిల్స్)


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు