బిగ్‌బాస్‌ వాయిస్‌ ఎవరిదో తెలిసిపోయిందా ?

16 Jun, 2018 11:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్‌ ఏంటంటే బిగ్‌బాస్‌. సీజన్‌ 1 గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో నిర్వాహకులు ఇటీవలే రెండో సీజన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆకట్టుకొనే వాటిలో బిగ్‌బాస్‌  వాయిస్‌ ఒకటి. అయితే ఇప్పటి వరకూ బిగ్‌బాస్‌ ఎవరో ఎవరికీ తెలియదు. సీజన్‌ మారింది. కంటెస్టంట్లు మారిపోయారు. హోస్ట్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ స్థానంలో నేచురల్‌ స్టార్‌ నానీ వచ్చేశారు. కానీ బిగ్‌బాస్‌ ఎవరు, గంభీరంగా ఉండే స్వరం మాత్రం ఎవరిదో ఎవరికీ తెలియదు. అయితే వీటన్నింటికి సమాధానంగా ఓ వార్త  హల్‌చల్‌ చేస్తోంది.

బిగ్‌బాస్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నది ఓ సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అని ఓ గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. పలు సినిమాలు, సీరియల్లు, ప్రకటనలకు డబ్బింగ్‌ చెప్పిన సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రాధాకృష్ణ బిగ్‌బాస్‌గా గొంతు సవరించారంట. ఇందుకోసం నిర్వాహకులు దాదాపు 100 మంది గొంతులను పరీక్షించి, రాధాకృష్ణను ఎంచుకున్నారట. అయితే ఈ వార్త ఎంత వరకూ అనేది రాధాకృష్ణ స్పందిస్తే తప్ప ఎవరికీ తెలియదు. బిగ్‌బాస్‌ ఏంచేస్తారంటే.. కంటెస్టంట్లకు టాస్క్‌ ఇవ్వడం, ఆదేశాలను జారీచేయడం, బిగ్‌బాస్‌ నియమనిబంధలను తెలియచెప్పడం వంటి పనులు చేస్తారు.

మరిన్ని వార్తలు