ఇంకా విమర్శలు చేస్తే చిన్మయిపై పిటిషన్‌ వేస్తా

18 Feb, 2020 10:53 IST|Sakshi

చెన్నై, పెరంబూరు: గాయనీ, డబ్బింగ్‌ కళాకారిణి చిన్మయిపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని సీనియర్‌ నటుడు, సౌత్‌ ఇండియన్‌ డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ అధ్యక్షుడు రాధార చెప్పారు. ఈయనపై గాయనీ చిన్మయి మీటూ ఆరోపణలు చేయడంతో ఆమెను  డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ నుంచి తొలగించారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది.  కాగా ఈ యూనియన్‌కు గత 15 తేదీన ఎన్నికలు జరిగాయి.

నటుడు రాధారవి మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయగా, ఆయనకు వ్యతిరేకంగా చిన్మయి నామినేషన్‌ను వేసింది. అయితే ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. అది  చట్టబద్దంగా లేదని పేర్కొన్నారు. దీంతో రాధారవి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీనిపై ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ సంక్షేమానికి పలు పథకాలును రచించినట్లు రాధారవి తెలిపారు. కాగా చిన్మయి వ్యవహారం గురించి మాట్లాడుతూ ఆమె తమపై ఆరోపణలు చేస్తున్నారని, ప్రచార ప్రియురాలిగా మారినట్లు విమర్శించారు. ఇంకా తమపై విమర్శలు చేస్తే చిన్మయిపై కోర్టులో పిటిషన్‌ వేస్తామని చెప్పారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్న: హీరోయిన్‌

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

అందుకు ఇది సమయం కాదు: రహమాన్‌

వారి పెళ్లి పెటాకులేనా?!

సినిమా

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్న: హీరోయిన్‌

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

వారి పెళ్లి పెటాకులేనా?!

రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!